Begin typing your search above and press return to search.

ఆ విషయంలో మహేష్ సినిమాలో లోటుండదు

By:  Tupaki Desk   |   8 Jan 2018 4:23 AM GMT
ఆ విషయంలో మహేష్ సినిమాలో లోటుండదు
X
టాలీవుడ్ లో మిగిలిన అన్ని జోనర్లతో తో పోలిస్తే పొలిటికల్ జోనర్ లో వచ్చే సినిమాలు తక్కువ. కొన్నాళ్ల క్రితం వచ్చిన లీడర్.. ఈమధ్య వచ్చిన నేనే రాజు.. నేనే మంత్రి సినిమాలు ఈ జోనర్ లో వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి. తెలుగులో స్టార్ హీరోలు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కథతో మూవీస్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఆ లోటును తీరుస్తూ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం భరత్ అనే నేను సినిమా చేస్తున్నాడు.

కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న భరత్ అనే నేను సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపింబోతున్నాడు. ఈమధ్య షూటింగుకు కాస్త గ్యాపిచ్చి ఫ్యామిలీతో ఫారిన్ టూర్ వెళ్లిన మహేష్ భరత్ అనే నేనుకు సంబంధించి పెండింగ్ పనులపై ఫోకస్ పెట్టనున్నాడు. ఈ సినిమా పూర్తిగా పాలిటిక్స్ మాత్రమే కాకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ఇతర అంశాలపైనా డైరెక్టర్ కొరటాల శివ కేర్ తీసుకున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా కొరటాల ముందు తీసిన మిర్చి.. శ్రీమంతుడు సినిమాల్లో హీరో- హీరోయిన్ల లవ్ ట్రాక్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు భరత్ అనే నేనులో కూడా హీరో మహేష్- హీరోయిన్ కియారా అద్వానీల మధ్య లవ్ స్టోరీ సూపర్ గా ఉంటుందని ఆ చిత్ర యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.

దీంతోపాటు పొలిటికల్ సినిమాల్లో పంచులకు.. సెటైర్లకు స్కోపెక్కువ. ఈ కోణంలో డైరెక్టర్ స్పెషల్ గా దృష్టి పెట్టాడట. దానికి తగ్గట్టే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మాంచి టైమింగ్ ఉన్నవాళ్లను తీసుకున్నారు. ప్రకాష్ రాజ్ - శరత్ కుమార్ - రావు రమేష్ - పోసాని కృష్ణ మురళి - దేవరాజ్ లాంటి సీనియర్ నటులంతా పొలిటీషియన్స్ పాత్రల్లో అదరగొట్టేస్తారని ఆ సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్పైడర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో మహేష్ తోపాటు అతడి ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు.