Begin typing your search above and press return to search.
శ్రీమంతుడు కంట్రోల్ తప్పుతున్నాడు
By: Tupaki Desk | 25 Jan 2016 11:30 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు బడ్జెట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో చేసిన ఆగడు చిత్రానికి కలెక్షన్స్ బాగానే వచ్చినా, అంటే 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించినా.. చివరకు పెట్టుబడితో పోల్చితే డిజాస్టర్ అని తేల్చేశారు. దీంతో ఆ తర్వాత ప్రొడక్షన్ కాస్ట్ విషయంలో చాలా అలర్ట్ గా ఉంటున్నాడు. ఇలా తన సినిమాలకు బడ్జెట్ ని అదుపులో ఉంచేందుకు.. తనే నిర్మాణంలో భాగస్వామి కూడా అవుతున్నాడు.
అలా తీసినదే శ్రీమంతుడు కూడా. లిమెటెడ్ బడ్జెట్ లో తీసి శ్రీమంతుడితో బ్లాక్ బస్టర్ సాధించాడు కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ బడ్జెట్ అనే మాటకు దూరం జరగాల్సి వస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న బ్రహ్మోత్సవంకు భారీగానే వెచ్చించాల్సి వస్తోంది. అసలు ప్రారంభంలో అనుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే.. ఈ పాటికే దాదాపుగా బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేసేయాలి. కానీ ఇంకా చాలా పెండింగ్ వర్క్ ఉంది. శ్రీమంతుడు తర్వాత రేంజ్ మారిపోవడంతో బడ్జెట్ విషయంలో నియంత్రణలు తప్పించాల్సి వస్తోంది. మరోవైపు దీని తర్వాత స్టార్ట్ చేయనున్న మురుగదాస్ సినిమాకు అయితే, ఇప్పటికే 100 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు చెప్పుకుంటున్నారు. సూపర్ స్టార్ క్రేజ్ తో పాటు తెలుగు - తమిళ్ - హిందీలో డైరెక్టర్ మురుగదాస్ కు ఉన్న ఫేమ్ కూడా దీనికి కారణమే.
ఏమైనా ఓ సక్సెస్ తర్వాత మళ్లీ ఇప్పుడు బడ్జెట్ కంట్రోల్ అనే మాటను పక్కన పెట్టక తప్పడం లేదు మహేష్ బాబుకి. అయినా ఎంత పెట్టుబడి పెట్టినా వెనక్కి తెచ్చేసుకోగల స్థాయి మహేష్ కి ఉంది లెండి. ఈ రెండు సినిమాల నిర్మాణంలో కూడా మహేష్ బాబు భాగస్వామే.