Begin typing your search above and press return to search.
మహేష్ సినిమాకి ఆఫర్స్ వచ్చేస్తున్నాయ్
By: Tupaki Desk | 10 Sept 2016 11:41 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు- నేషనల్ వైడ్ గా క్రేజ్ ఉన్న డైరక్టర్ మురుగదాస్ కాంబినేషనల్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు-తమిళ్ భాషల్లో ఒకేసారి తీయనుండగా.. కనీసం 100 కోట్ల బడ్జెట్ ను ముందే కేటాయించారు. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రానికి అప్పుడే బిజినెస్ డీలింగ్స్ మొదలైపోయాయి.
మహేష్ ఉన్నాడు కాబట్టి తెలుగులోను.. మురుగదాస్ సినిమా కావడంతో తమిళ్ లోను ఆఫర్స్ రావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ వీరిద్దరి కాంబినేషన్ కావడంతో బాలీవుడ్ కూడా ఈ మూవీపై కన్నేసింది. హిందీ నుంచి కూడా క్రేజీ ఆఫర్స్ వస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అది కూడా పెద్ద స్టూడియోల నుంచి ఈ ఆఫర్స్ రావడం విశేషం. ఇప్పటికే నిర్మాతలు చర్చల్లో వేగం పెంచగా.. త్వరలోనే హిందీ డబ్బింగ్ వెర్షన్ కి సంబంధించి డీల్ పూర్తి అయిపోతుందని టాక్ వినిపిస్తోంది.
ఇక తెలుగు.. తమిళ్ నుంచి అయితే చెప్పాల్సిన పని లేదు. మహేష్ ఆల్ టైం హిట్ శ్రీమంతుడు కంటే చాలా ఎక్కువ మొత్తానికి రైట్స్ అడుగుతుండడం విశేషంగా చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా.. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈ సినిమా రిలీజ్ అని దర్శకుడు ఇప్పటికే చెప్పేశాడు.