Begin typing your search above and press return to search.
పవన్ కొట్టాడు.. మహేష్ కొట్టలేడా?
By: Tupaki Desk | 18 Feb 2017 2:28 PM IST‘కాటమరాయుడు’ సినిమా మొదలైనప్పటి నుంచి దాని గురించి ఎక్కువగా నెగెటివ్ వార్తలే వచ్చాయి. ప్రారంభోత్సవం జరుపుకున్నాక ఈ చిత్రం నుంచి దర్శకుడు ఎస్.జె.సూర్య తప్పుకోవడం.. తర్వాత డాలీ రాక కూడా ఏమంత ఎగ్జైట్మెంట్ తేకపోవడం.. సినిమా అనుకున్న సమయానికి సెట్స్ మీదికి వెళ్లకపోవడం.. ఇలా ప్రతిదీ ప్రతికూలంగానే కనిపించింది. దీనికి తోడు ఇది తమిళ సినిమా ‘వీరం’కు రీమేక్ అన్నాక ఆసక్తి మరింత తగ్గింది. ఫస్ట్ లుక్ పోస్టర్ అంటూ పవన్ ప్రైవేటు ఫొటో ఒకటి పెట్టి లోగో డిజైన్ చేయడం కూడా విమర్శలకు దారి తీసింది.
ఐతే ఈ నెగెటివిటీ అంతా కూడా ఒకే ఒక్క టీజర్ తో ఎగిరిపోయింది. ‘కాటమరాయుడు’ టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది. అంతకుముందు వరకు ‘కాటమరాయుడు’ బిజినెస్ కూడా అనుకున్న స్థాయిలో జరగలేదు. కానీ టీజర్ రిలీజయ్యాక క్రేజీ ఆఫర్లు వచ్చాయి. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ప్రభావం ఏమీ లేకుండా మంచి మంచి రేట్లకు సినిమాను కొంటున్నారు. ఈ సినిమా బిజినెస్ కూడా రూ.100 కోట్ల మార్కును టచ్ చేస్తుందన్న అంచనాలున్నాయి.
ఎంతో నెగెటివిటీ మధ్య ‘కాటమరాయుడు’ సినిమానే ఇంత క్రేజ్ సంపాదించుకుంటే.. ఇక మహేష్ బాబు-మురుగదాస్ సినిమాకు ఇంకెంత హైప్ వస్తుందో అన్న చర్చ మొదలైంది టాలీవుడ్లో. మామూలుగా మహేష్ సినిమా ఏదైనా ఒకటి ఫ్లాప్ అయినా.. దాని ప్రభావం తర్వాతి సినిమాపై పడదు. మహేష్ అంటేనే.. సినిమా సినిమాకు బిజినెస్ లెక్కలు మారిపోతుంటాయి. 1 నేనొక్కడినే.. ఆగడు లాంటి డిజాస్టర్ల తర్వాత ‘శ్రీమంతడు’ ఏ స్థాయిలో బిజినెస్ చేసింది... ఎంత వసూలు చేసింది తెలిసిందే.
ఇప్పుడు ‘బ్రహ్మోత్సవం’ ఎఫెక్ట్ కూడా మురుగదాస్ సినిమా మీద కూడా ఏమాత్రం పడే ఛాన్సులు కనిపించట్లేదు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా ఏ విశేషం బయటికి రాలేదు. నేరుగా టీజర్ లాంచ్ చేయబోతున్నారు. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఆల్రెడీ ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా రూ.35 లక్షల భారీ ఖర్చుతో అదిరిపోయే టీజర్ రెడీ అవుతోందన్న వార్తలొస్తున్నాయి. మురుగదాస్ స్టామినా ఏంటో తెలిసిందే కాబట్టి ఈ టీజర్ కచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ టీజర్ అంచనాలకు తగ్గట్లే ఉండాలి కానీ.. ఈ సినిమా బిజినెస్ అనూహ్యమైన స్థాయికి చేరుతుందని భావిస్తున్నారు. తెలుగు-తమిళం రెండిట్లో కలిపి రూ.150 కోట్ల బిజినెస్ చేసినా ఆశ్చర్యం లేదేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/