Begin typing your search above and press return to search.
మహేష్ సినిమా వాయిదా?
By: Tupaki Desk | 7 Jan 2017 12:54 PM IST‘బ్రహ్మోత్సవం’ చేదు జ్నాపకాల్ని చెరిపివేసే సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. కానీ మహేష్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. మురుగదాస్ సినిమాను మొదలుపెట్టడానికి టైం తీసుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా అనుకున్న దాని కంటే కొంచెం నెమ్మదిగానే సాగుతోంది. ఐతే షూటింగ్ ఎలా జరిగినా సినిమా ఏప్రిల్లో వచ్చేస్తుందిలే అని ధీమాగా ఉన్నారు అభిమానులు. కానీ తాజా పరిస్థితి చూస్తుంటే ఈ సినిమా ఏప్రిల్లో వచ్చేలా కనిపించట్లేదు. షూటింగ్ కొంచెం ఆలస్యం కావడం ఇందుకు ఒక కారణమైతే.. ‘బాహుబలి’ ఏప్రిల్లోనే రాబోతున్న నేపథ్యంలో ఈ నెలలో విడుదలకు సరైన తేదీ దొరక్కపోవచ్చని భావిస్తున్నారు.
ఏప్రిల్ 14న తమిళ సంవత్సరాది కావడంతో ఆ రోజు అజిత్ కొత్త సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఐతే మహేష్ తొలిసారిగా చేస్తున్న ద్విభాషా చిత్రాన్ని తమిళంలోనూ పెద్ద ఎత్తున రిలీజ్ చేయాలంటే వేరే డేట్ చూసుకోవాలి. వారం వెనక్కి వెళ్దామంటే చివరి వారంలో ‘బాహుబలి: ది కంక్లూజన్’ వస్తోంది. ముందుకు వద్దామంటే అప్పటికి సినిమా పూర్తవదు. మేలో రిలీజ్ చేద్దామంటే ఆ నెలలో వచ్చిన తన సినిమాలకు చేదు అనుభవాలు ఎదురైన నేపథ్యంలో అప్పుడు వద్దని మహేష్ అంటున్నాడట. దీంతో జూన్ నెలకు సినిమా వాయిదా వేద్దామని భావిస్తున్నట్లు సమాచారం. సినిమా ఇలా వాయిదా పడితే అభిమానుల ఫీలవుతారు కానీ.. సినిమా మంచి కోసం ఇది తప్పదని మహేష్ భావిస్తున్నాడట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/