Begin typing your search above and press return to search.
మహేష్-మురుగ.. ఈసారి పక్కా
By: Tupaki Desk | 10 July 2016 3:48 PM ISTదాదాపు ఏడాది కిందట మహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్లో సినిమా ఓకే అయింది. అప్పటికి ఇద్దరూ వేరే కమిట్మెంట్లతో ఉండటంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లాలని భావించారు. కానీ రకరకాల కారణాలతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పటికి సినిమా లాంచింగ్ విషయంలో మూడు నాలుగు డెడ్ లైన్లు అనుకున్నారు. కానీ ఆ డేట్లు దాటిపోయాయి. ఈ మధ్య మహేష్ బాబు ఈ పాత్ర కోసం లుక్ మార్చుకుంటున్నారని.. అందుకే సినిమా మరింత ఆలస్యమవుతుందని కొత్త కబురు వినిపించింది. దీంతో మహేష్-మురుగదాస్ డ్రీమ్ కాంబినేషన్ ఇంకెప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందో.. సినిమా ఎప్పుడు మొదలవుతుందో అని అభిమానులు అసహనానికి గురవుతున్నారు. ఐతే ఎట్టకేలకు ఈ సినిమాకు మంచి ముహూర్తం కుదిరిందట. ఈ నెల 29నే సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లిపోతున్నారట. ప్రారంభోత్సవంతో పాటే రెగ్యులర్ షూటింగ్ కూడా అదే రోజు మొదలైపోతుందని సమాచారం.
ఇంతకుముందు అనుకున్నట్లు ముంబయిలోనో మరో చోటో కాకుండా హైదరాబాద్ లోనే తొలి షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్ శివార్లలో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణతో షూటింగ్ మొదలవుతుందట. పది రోజులకు పైగా ఈ షెడ్యూల్ అయ్యాక బ్రేక్ తీసుకుని.. తర్వాతి షెడ్యూల్ ప్లాన్ చేస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టు విషయంలో అన్ని విషయాలూ ఫైనలైజ్ అయిపోయాయి. ఈ మధ్యే పరిణీతి స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ను హీరోయిన్ గా ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలన్నది ప్లాన్.