Begin typing your search above and press return to search.
మహేష్ సినిమా ఒక జిల్లాకు 6.8 కోట్లా?
By: Tupaki Desk | 21 March 2016 11:30 AM GMTతెలుగు సినిమా మార్కెట్ ను మరో స్థాయికి తీసుకెళ్లిన హీరోల్లో మహేష్ బాబు ఒకడు. పోకిరి - దూకుడు - శ్రీమంతుడు లాంటి సినిమాలతో తెలుగు సినిమా రేంజే మార్చేశాడు నవతరం సూపర్ స్టార్. రెండు పెద్ద డిజాస్టర్ల తర్వాత కూడా ‘శ్రీమంతుడు’ సినిమా బిజినెస్ - కలెక్షన్ల పరంగా నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ కొల్లగొట్టేయడం మహేష్ బాబు స్టామినాకు నిదర్శనం. తాజాగా ‘బ్రహ్మోత్సవం’ సినిమాకు కూడా మహేష్ కెరీర్ లోనే అత్యధిక బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మహేష్ తర్వాతి సినిమా విషయంలోనూ రికార్డుల మోత మోగడం ఖాయంలా కనిపిస్తోంది.
సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ తన తర్వాతి సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా ముహూర్తం కూడా జరుపుకోని ఈ సినిమాకు అప్పుడే ఒక జిల్లాలో బిజినెస్ పూర్తయిపోవడం విశేషం. తూర్పు గోదావరి జిల్లాకు ఓ డిస్ట్రిబ్యూటర్ అప్పుడే నిర్మాతలతో అగ్రిమెంట్ కూడా చేసేసుకున్నాడు. ఈ ఒక్క జిల్లాకే రూ.6.8 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చాడట ఆ బయ్యర్. బాహుబలి సినిమాకు సైతం ఈ జిల్లా హక్కులు రూ.5.25 కోట్లే పలికాయి. అలాంటిది దాని మీద ఒకటిన్నర కోట్ల దాకా ఎక్కువ పలకడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా సినిమా మొదలవకముందే ఈ స్థాయిలో బిజినెస్ జరగడం అద్భుతమే. ఇప్పుడే ఇంత డిమాండ్ ఉందంటే.. ఇక సినిమా మొదలై.. పూర్తయ్యాక ఎంత క్రేజ్ ఉంటుందో మరి.