Begin typing your search above and press return to search.
వాస్కోడగామా? కాస్కో.. రూమరేనమ్మా
By: Tupaki Desk | 29 Jun 2016 4:12 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా స్టార్ట్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. యూరోప్ లో లాంగ్ టూర్ వెళ్లొచ్చిన సూపర్ స్టార్.. మురుగ సినిమాని పట్టాలెక్కించేందుకు మేకోవర్ చేయబోతున్నాడు. చాలాకాలం తర్వాత మహేష్ ను డిఫరెంట్ లుక్ లో కనిపించనుండడం విశేషం. ఈ లుక్ గురించి డీటైల్స్ ఇంకా బైటకు రాలేదు కానీ.. టైటిల్ పై ఇప్పుడు తెగ ప్రచారం జరిగిపోతోంది.
మహేష్-మురుగ కాంబినేషన్ లో తెరకెక్కే మూవీకి 'వాస్కో డ గామా' అనే టైటిల్ ఫిక్స్ చేశారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అయితే.. ఇప్పుడీ టైటిల్ విషయంలో దర్శకుడు మురుగదాస్ నుంచి ఓ క్లారిటీ వచ్చింది. వాస్కో డ గామా అనే టైటిల్ కరెక్ట్ కాదని.. అది కేవలం రూమరేనని.. అసలు తాము ఏ టైటిట్ ని ఇంకా అనుకోలేదని తేల్చేశాడు దర్శకుడు. ప్రస్తుతం 2-3 టైటిల్స్ ను పరిశీలిస్తున్నా.. స్టోరీ - కేరక్టర్ ప్రకారం మహేష్ ఇమేజ్ కి ఏ మాత్రం తీసిపోనిదిగా సినిమా పేరు పెడతామని మాత్రం భరోసా ఇచ్చేశాడు. అందులోను తెలుగు - తమిళ భాషల్లో రూపొందే ఈ మూవీకి.. రెండు లాంగ్వేజెస్ లోనూ సెట్ అయ్యేలా ఒకే పేరు పెట్టాలని భావిస్తున్నారనే క్లూ మాత్రం ఇచ్చాడంతే.
ఇక ఈ మూవీ కోసం మేకోవర్ తో పాటు మరో కొత్త పని చేయనున్నాడు మహేష్. అదే.. తమిళ్ వెర్షన్ కి తనే డబ్బింగ్ చెప్పడం. 100 కోట్లకు పైగా బడ్జెట్ రూపొందనున్న ఈ సినిమా విషయంలో ఎలాంటి పాయింట్స్ వదిలే ఉద్దేశ్యం లేదని తెలుస్తోంది. చిన్నప్పుడు చెన్నైలోనే పెరిగిన మహేష్ కు తెలుగుతో పాటే తమిళ్ కూడా బ్రహ్మాండంగా వచ్చని తెలుసు కదా!