Begin typing your search above and press return to search.
అభిమన్యుడు Vs ఏజెంట్ శివ.. ఏది ఫైనల్?
By: Tupaki Desk | 25 Oct 2016 11:00 PM ISTఇప్పుడు అందరి చూపూ మహేష్ బాబు సినిమా ఫస్ట్ లుక్ మీదనే ఉంది. రోజుకో న్యూస్ వస్తున్నా కూడా.. అసలు ఈ సినిమా ఫస్ట్ లుక్ అనేది వస్తేనే అసలు థ్రిల్ అనేది మొదలవుతుంది. అందుకే అందరూ ఏ.ఆర్.మురుగుదాస్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా తాలూకు ఫస్ట్ లుక్ దీపావళి సందర్భంగా వస్తుందా రాదా అని ఎదరుచూస్తున్నారు.
ఒకవేళ నిజంగానే ఫస్ట్ లుక్ వస్తుంటే.. దానికి ఇంకా నాలుగు రోజులే టైముంది. ఈ సమయంలో ఒక హాట్ న్యూస్ ఒకటి తెలుస్తోంది. అదేంటంటే.. అసలు సినిమాకు టైటిల్ ఏమని పెట్టాలో ఇంకా డిసైడ్ అవ్వలేదట. ముందుగా ఈ సినిమాకు అనేక టైటిల్స్ వినిపించినా కూడా.. ఇప్పుడు మాత్రం నిర్మాతలు రెండు టైటిల్స్ రిజష్టర్ చేయించారు. ఒకటి ''అభిమన్యుడు'' కాగా రెండోది ''ఏజెంట్ శివ''. గతంలో అభిమన్యుడు అనే న్యూస్ బయటకు వచ్చినప్పుడు.. ఆ పేరుకు దగ్గర టైటిల్స్ తో శోభన్ బాబు అండ్ కళ్యాణ్ రామ్ చేసిన సినిమాలు ఫ్లాపయ్యాయ్ కాబట్టి.. అభిమానులు నెగెటివ్ సెంటిమెంట్ వ్యక్తపరిచారు. అందుకే ఇప్పుడు ''ఏజెంట్ శివ'' తెరమీదకు వచ్చింది.
అయితే మహేష్ బాబుకు ''అభిమన్యుడు'' టైటిల్ బాగా యాప్ట్ అనిపించడం.. కాని మురుగుదాస్ ''ఏజెంట్ శివ'' అనే టైటిల్ సూచించడంతో.. ఇప్పుడు ఈ రెండూ రిజిష్టర్ చేయించి.. అందులో ఒకటి ఫిక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మరి దీపావళిలోపు ఫిక్స్ చేసేస్తారా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/