Begin typing your search above and press return to search.
'శివ' కావాల్సిందే అంటున్న మహేష్?
By: Tupaki Desk | 1 Dec 2016 11:00 PM ISTమహేష్ బాబు-మురుగదాస్ కాంబినేషన్ లో యాక్షన్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అహ్మదాబాద్ లో మకాం వేసిన యూనిట్.. ఏకంగా నెలరోజుల పాటు యాక్షన్ సీన్స్ నే పిక్చరైజ్ చేయనున్నారంటే.. ఏ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ను చూపించబోతున్నారో అర్ధమవుతుంది.
సినిమా మూడో షెడ్యూల్ పూర్తయిపోతున్నా.. ఈ మూవీ టైటిల్ విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు. కానీ మహేష్ నుంచి మాత్రం స్పష్టంగా ఇన్ స్ట్రక్షన్స్ వచ్చాయట. ఈ చిత్రానికి రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. చట్టానినికి కళ్లులేవు.. అభిమన్యుడు.. వాస్కో డ గామా.. ఏజంట్ శివ.. అంటూ రకరకాల టైటిల్స్ వినిపించాయి. వీటిలో దేన్నీ ఇంకా ఫైనలైజ్ చేయలేదు కానీ.. అభిమన్యు.. ఏజంట్ శివ టైటిల్స్ మాత్రం ఇప్పటికే రిజిస్టర్ చేయించేశారు. ఈ రెండు పేర్లలోంచి ఒకటి ఎంచుకుంటారని చెప్పేందుకు ఇది సరిపోతుంది. అయితే.. వీటిపై కూడా మహేష్ దగ్గర నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయట.
తన సినిమా టైటిల్ లో 'శివ' అనే పదం కచ్చితంగా ఉండాలని చెప్పేశాడట మహేష్. అయితే.. ఇప్పుడీ చిత్రానికి 'శివ'అని ఫైనల్ చేస్తారా 'ఏజంట్ శివ' అంటారా అనే సంగతి తేలలేదు. శివ టైటిల్ పై నాగార్జున నటించిన సెన్సేషనల్ మూవీ ఉంది. మరి శివను ఇచ్చేందుకు నాగ్ ఒప్పుకుంటారా అన్నదే అసలైన డౌట్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/