Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు మ‌హేష్ తో న‌మ్రత డీల్

By:  Tupaki Desk   |   18 Dec 2022 6:30 AM GMT
పెళ్లికి ముందు మ‌హేష్ తో న‌మ్రత డీల్
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ టాలీవుడ్ లో ప‌ర్ఫెక్ట్ ఫ్యామిలీమ్యాన్ అని పిలిచేందుకు ఎవ‌రూ సంకోచించ‌రు. సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్ కి కావాల్సినంత స‌మ‌యం కేటాయించ‌డం త‌న ప్ర‌త్యేక‌త‌. ఈ జంట ఆనందంలో కిడ్స్ గౌత‌మ్- సితార ముఖ్య‌మైన‌ భాగం. నిజానికి బేబి సితార జ‌న‌నం ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానికి బిగ్ స‌ర్ ప్రైజ్. గౌత‌మ్ తో స‌రిపెట్టుకోవాల‌నుకుని రెండో బిడ్డ‌ను ఆశించ‌ని న‌మ్ర‌త‌కు అనూహ్యంగా సితార జ‌న్మించింది. అందుకే గౌత‌మ్ - సితార మ‌ధ్య వయోభేధం ఎక్కువ‌.

ఇక మ‌హేష్ సూప‌ర్ స్టార్ డ‌మ్ తో వెలిగిపోవడం వెన‌క న‌మ్ర‌త స‌పోర్ట్ ని ఎవ‌రూ మ‌రువ‌లేరు. అలానే న‌మ్ర‌త త‌న త‌ల్లిదండ్రులిరువురిని కోల్పోయిన‌ప్పుడు త‌న‌కు అన్నీ తానే అయ్యాడు మ‌హేష్‌. న‌మ్ర‌త‌కు ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నాడు. ఇవ‌న్నీ తెలిసిన విష‌యాలే అయినా ఇటీవ‌ల ఓ యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలో న‌మ్ర‌త మ‌రోసారి స్వయంగా వెల్ల‌డించారు.

అంతేకాదు పెళ్లికి ముందు మ‌హేష్‌-న‌మ్ర‌త న‌డుమ ఒక డీల్ కుదిరిందిట‌. అది చాలా ఆస‌క్తిక‌రం. పెళ్లి త‌ర్వాత న‌మ్ర‌త గృహిణిగా మాత్ర‌మే ఉండాల‌ని సినిమాల్లో న‌టించ‌వ‌ద్ద‌ని మ‌హేష్ కోరార‌ట‌. అలాగే పెళ్లి అయిన వెంట‌నే ఒక పెద్ద బంగ్లాలో నివ‌శించేందుకు తాను సిద్ధంగా లేన‌ని అపార్ట్ మెంట్ లో నివ‌శించాల‌ని న‌మ్ర‌త‌ కండీష‌న్ పెట్టార‌ట. పెద్ద బంగ్లాలో నివ‌శించ‌డం అంటే త‌న‌కు భ‌యం అని కూడా చెప్పింద‌ట‌. అలా ఈ జంట జూబ్లీహిల్స్ లోని జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ పరిస‌రాల్లోని ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక కార్యాల‌యం ద‌గ్గ‌ర‌లో ఒక అపార్ట్ మెంట్ లో చాలా కాలం నివాసం ఉన్నారు. ఆ త‌ర్వాత ఫిలింన‌గ‌ర్ లో ఒక సుంద‌ర‌మైన భవంతిని నిర్మించుకుని అక్క‌డికి షిఫ్ట‌య్యారు. ఈ భ‌వంతి నిర్మాణం ఆర్కిటెక్క‌ర్ ఇంటీరియ‌ర్ స‌హా ప్ర‌తిదీ న‌మ్ర‌త ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. ఈ అన్యోన్య జంట‌కు ఆ ఇల్లు ఎంత‌గానో క‌లిసొచ్చింద‌ని చెప్పాలి. ఈ ఇంట్లో ఉండ‌గానే పిల్ల‌లు పెద్ద‌వారవుతున్నారు. అలాగే జీఎంబి బ్యాన‌ర్ ని స్థాపించి నిర్మాత‌లుగా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఇటీవ‌ల ఏఎంబీ సినిమాస్ రూప‌క‌ల్ప‌న పెద్ద స‌క్సెసైంది. ఎన్నో బిజినెస్ ల‌లో రాణిస్తున్నారు. వీట‌న్నిటినీ మించి మ‌హేష్ ఎదురేలేని స్టార్ డ‌మ్ తో వెలిగిపోతున్నారు.

ఇక జీవితంలో ఎలాంటి క్లిష్ట స‌న్నివేశాలు ఎద‌రైనా మ‌హేష్ ఒక రాక్ (రాయి)లా ఎదురు నిలిచాడ‌ని నమ్రత తెలిపింది. ముఖ్యంగా త‌న‌ తల్లితండ్రుల మరణానంతరం మహేష్ ఆమెను చాలా చక్కగా చూసుకున్నాడు. అప్పటికి గౌతమ్ వ‌య‌సు ఏడాది మాత్ర‌మే. అటుపై చాలా గ్యాప్ తర్వాత సితార అనుకోకుండా జ‌న్మించింది. ఇప్పుడు క్యూట్ సితార మొత్తం ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానికి వెలుగులు ప్ర‌స‌రిస్తోంది. ఈ ఏడాదిలో మ‌హేష్ త‌న కుటుంబంలో ముగ్గురు ఆప్తుల‌ను కోల్పోయారు. విజ‌య‌నిర్మ‌ల.. మ‌హేష్ మాతృమూర్తి ఇందిరా దేవి.. తండ్రిగారైన‌ సూప‌ర్ స్టార్ కృష్ణ స్వ‌ర్గ‌లోక అధిరోహ‌కులు అయ్యారు. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో న‌మ్ర‌త అతడికి అన్నివిధాలా అండ‌గా ఉన్నారు.

హీరోయిన్ల‌తో మ‌హేష్ క‌థేంటి?

ఇక ఇదే ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ కి పెద్ద తెర‌పై స‌రిజోడు ఎవ‌రు? అన్న ప్ర‌శ్న ఎదురు కాగా న‌మ్ర‌త ఈక్వేష‌న్ ఆస‌క్తిని క‌లిగించింది. మ‌హేష్‌- సోనాలి బింద్రే జంట చూడ‌టానికి ఎంతో ముచ్చ‌ట‌గా ఉంటారు. `అత‌డు`లో త్రిష‌.. `ఒక్క‌డు`లో భూమిక బాగా సెట్ట‌య్యార‌ని.. టైమింగ్ విష‌యంలో అనుష్క శెట్టితో మ‌హేష్ స‌న్నివేశాలు(ఖ‌లేజా) బాగా న‌చ్చుతాయ‌ని కూడా తెలిపారు. స‌మంత‌తోను జోడీ బావుంటుంద‌ని ప్ర‌శంసించారు. అయితే రాజ‌కుమారుడు చిత్రంతో టాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన చిల్లుబుగ్గ‌ల ప్రీతి జింతాను మాత్రం నమ్రత మ‌ర్చిపోయారు. మ‌హేష్‌- ప్రీతి జింతా జంట కూడా ఎంతో బాగా తెలుగు ఆడియెన్ కి న‌చ్చారు ఆరంగేట్ర‌మే.