Begin typing your search above and press return to search.

మహేష్‌, న‌మ్ర‌తల జీవితంలో భ‌యాన‌క స‌మ‌యం అదేన‌ట‌!

By:  Tupaki Desk   |   18 Dec 2022 1:44 PM GMT
మహేష్‌, న‌మ్ర‌తల జీవితంలో భ‌యాన‌క స‌మ‌యం అదేన‌ట‌!
X
టాలీవుడ్ లో వున్న స్టార్ క‌పుల్స్ లో అత్యంత పాపులారిటీని ద‌క్కించుకుని నెట్టింట నిత్యం అభిమానుల‌కు అందుబాటులో వుంటున్న జోడీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌. `వంశీ` సినిమా లో తొలి సారి క‌లిసి క‌లిసి న‌టించిన ఈ జంట అదే సినిమా షూటింగ్ టైమ్ లో ప్రేమ‌లో ప‌డ్డారు. ఆ ప్రేమ‌కు ఇరు కుటుంబాల పెద్ద‌లు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో 2005లో వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యారు. గ‌త 17 ఏళ్లుగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. పెళ్లి త‌రువాత నుంచి న‌మ్ర‌త సినిమాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెప్పేసి హౌస్ వైఫ్ గా వుంటోంది.

తాజాగా ఓ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించిన న‌మ్ర‌త ప‌లు వ్య‌క్తిగ‌త విఝ‌యాల‌తో పాటు వైవాహిక జీవితం గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా న‌మ్ర‌త మాట్లాడుతూ `వైవాహిక బంధం స‌జావుగా సాగాలంటే భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య న‌మ్మ‌కం వుండాలన్నారు. అంతే కాకుండా మ‌హేష్ తో త‌న జీవితం ఇంత అందంగా వుండ‌టానికి అదే కార‌ణ‌మ‌ని తెలిపింది న‌మ్ర‌త‌. ఇద్ద‌రు వ్యక్తుల‌ మ‌ధ్య న‌మ్కం వుంటే ఏ బంధ‌మైనా సంతోషంగా సాగుతుంద‌న్నారు.

మ‌హేష్ తో నా వివాహ‌మై 17 ఏళ్ల‌వుతోంది. పెళ్లి కాక‌ముందు మేమిద్ద‌రం మంచి స్నేహితులం. అన్ని విష‌యాలు పంచుకునే వాళ్లం. మా మ‌ధ్య అనుమానాల‌కు, ర‌హ‌స్యాల‌కు, అప‌న‌మ్మ‌కాల‌కు తావు లేదు. ఒక వేళ ఆయ‌న ఎప్పుడైనా బ‌య‌ట‌కు వెళితే.. ఎక్క‌డికి వెళ్లావు?.. ఎవ‌రితో వున్నావు? ఏం చేస్తున్నావు? అంటూ ఇక‌టికి ప‌ది సార్లు ఫోన్ లు చేసి విసిగించ‌ను. మ‌హేష్ కూడా అంతే అని తెలిపింది. ఇక పిల్ల‌లు గౌత‌మ్‌, సితార పుట్టాక జీవిత‌మే మారిపోయింద‌న్నారు.

ఒక త‌ల్లిగా ప్రతి క్ష‌ణాన్ని ఆస్వాదిస్తున్నా. గౌత‌మ్ పుట్టిన రోజుని మేమంతా ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేం. అది మా జీవితాల్లో ఓ భ‌యాన‌క స‌మ‌యం. ఏడో నెల‌లో చెక‌ప్ కోసం హాస్పిట‌ల్ కి వెళ్లాం. ప‌రీక్షించిన డాక్ట‌ర్లు బాబు పేగు మెడ‌లో వేసుకున్నాడ‌ని, త‌న‌కి ఊపిరీ కూడా ఆడ‌టం లేదని, హార్ట్ బీట్ స‌రిగా లేద‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని మ‌హేష్ కు ఫోన్ చేసి చెప్పారు. ల‌క్కీగా మ‌హేష్ హైద‌రాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సినిమా షూటింగ్ లో వున్నాడు.

వెంట‌నే హాస్పిట‌ల్ కు వ‌చ్చాడు. త‌ను వ‌చ్చిన వెంట‌నే ఆప‌రేష‌న్ చేసి బాబుని బ‌య‌ట‌కు తీశారు. అప్పుడు గౌత‌మ్ 1.5 కేజీలు మాత్ర‌మే వున్నాడు. బాబు విష‌యంలో మేము ఏం చెప్ప‌లేమ‌ని మ‌హేష్ కు డాక్ట‌ర్లు ముందే చెప్పేశారు. దాంతో మూడు వారాల పాటు బాబుని డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే వుంచాం. రోజుకి 40 గ్రాములు మాత్ర‌మే పాలు ప‌ట్టించాల‌న్నారు. అంతే కాకుండా 10 గ్రాములు మాత్ర‌మే బ‌రువు పెర‌గాల‌న్నారు. మేము రోజూ ప‌డుకునే ముందు గౌత‌మ్ బ‌రువు పెర‌గాలని దేవుడిని ప్రార్థించే వాళ్లం. గౌత‌మ్ ఇప్పుడు ఇలా వున్నాడంటే దానికి డాక్టర్లే కార‌ణం` అంఊ అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టారు న‌మ్ర‌త‌.