Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్-మహేష్..యాటిట్యూడ్ అదుర్స్

By:  Tupaki Desk   |   20 Sept 2017 3:03 PM IST
ఎన్టీఆర్-మహేష్..యాటిట్యూడ్ అదుర్స్
X
దసరా సినిమాల సందడికి సమయం దగ్గరపడింది. ఇంకొక్క రోజులో ఎన్టీఆర్ మూవీ ‘జై లవకుశ’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. సరిగ్గా ఇంకో వారం తర్వాత మహేష్ బాబు ‘స్పైడర్’ సందడి మొదలవుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాలకు సంబంధించిన రెండు కొత్త పోస్టర్లు వదిలారు మేకర్స్. ఇవి రెండూ వేటికవే ప్రత్యేకతను చాటుకుంటూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పోస్టర్లలో ఎన్టీఆర్.. మహేష్ బాబుల యాటిట్యూడ్ అభిమానులకు మంచి కిక్కిస్తోంది.

‘జై లవకుశ’ విడుదలకు ఒక్క రోజే సమయం ఉందని చెబుతూ.. ఎన్టీఆర్ ఆర్ట్స్ వాళ్లు ఈ రోజు ట్విట్టర్లో ఒక పోస్టర్ వదిలారు. ‘జై లవకుశ’కు ప్రధాన ఆకర్షణ అవుతుందని భావిస్తున్న జై పాత్ర యాటిట్యూడ్ చూపించే పోస్టర్ అది. అందులో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయిందంతే. ఈ పాత్ర తాలూకు ఇంటెన్సిటీ మొత్తం ఈ పోస్టర్లో చూపించేశారు. ఇది నందమూరి అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది.

ఇక తాజాగా రిలీజ్ చేసిన ‘స్పైడర్’ రిలీజ్ డేట్ పోస్టర్లో మహేష్ బాబు లుక్.. అతడి యాటిట్యూడ్ కూడా ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు ‘పోకిరి’ సినిమాలో ఇలాగే గన్నులోకి బుల్లెట్ లోడ్ చేస్తూ మహేష్ చూపించిన యాటిట్యూడ్ ను గుర్తుకు తెస్తోంది ఈ పోస్టర్. కాకపోతే ‘పోకిరి’లో ఊర మాస్ గా కనిపించిన మహేష్.. ఇప్పుడు పక్కా క్లాస్ గా తయారయ్యాడు. మరి ‘పోకిరి’ లాగే ‘స్పైడర్’ కూడా సంచలనం రేపుతుందేమో చూడాలి.