Begin typing your search above and press return to search.

#EMK : ఎన్టీఆర్ ఈర్ష్య... మహేష్‌ దిష్టి

By:  Tupaki Desk   |   6 Dec 2021 10:31 AM GMT
#EMK : ఎన్టీఆర్ ఈర్ష్య... మహేష్‌ దిష్టి
X
జెమిని టీవీలో టెలికాస్ట్‌ అయిన మహేష్‌ బాబు స్పెషల్‌ ఎన్టీఆర్‌ ఎవరు మీలో కోటీశ్వరులు కు మంచి స్పందన వచ్చింది. సాదారణ ఎపిసోడ్స్ కు వచ్చే రెస్పాన్స్ కు దాదాపుగా పది రెట్ల స్పందన ఈ ఎపిసోడ్‌ కు వచ్చిందనే టాక్ వినిపిస్తుంది. పెద్ద ఎత్తున ఈ ఎపిసోడ్‌ రేటింగ్‌ ఉండబోతుందని అంటున్నారు.

ఇక షో లో ఈ స్టార్‌ హీరోలు ఇద్దరు పలు విషయాల గురించి ముచ్చటించుకున్నారు. సినిమాల విషయాల నుండి మొదలుకుని ఇండస్ట్రీ విషయాలు.. స్నేహితుల విషయాలు.. వ్యక్తిగత విషయాల.. ఫ్యామిలీ విషయాలు.. ఇలా అనేక విషయాల గురించి వీరు చర్చించుకున్నారు. అలా ఇద్దరు కూడా సరదాగా ఎపిసోడ్‌ ను అలా అలా చూస్తుండగానే అర్రె అప్పుడే పూర్తి అయ్యిందా అనుకునేలా నడిపించారు.

మహేష్‌ బాబు మాట్లాడుతూ తన కూతురు సితారతో గడిపే ప్రతి క్షణం చాలా స్పెషల్‌ గా ఉంటుంది. తను రోజు రోజుకు నాకు దగ్గర అవుతూనే ఉంటుంది అన్నాడు. అప్పుడు మహేష్‌ బాబు మాట్లాడుతూ.. బిడ్డలు ఉన్న వారిని చూస్తే నాకు ఈర్ష్య కలుగుతుంది అన్నాడు. ఎన్టీఆర్‌ కు ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెల్సిందే.

అమ్మాయి అంటే చాలా ఇష్టపడే ఎన్టీఆర్‌ తన భార్యనే తన కూతురుగా భావిస్తాను అంటూ ఇదే షో లో ఒక ఎపిసోడ్‌ లో చెప్పడం జరిగింది. కూతురును ఎన్టీఆర్‌ మిస్ అవుతున్నట్లుగా తాజా ఎపిసోడ్ ద్వారా మరింత స్పష్టత వచ్చిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌ మరియు మహేష్ బాబులు ఇంకా పలు విషయాల గురించి సరదాగా మాట్లాడుకున్నారు.

ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ఏడాదిలో 300 రోజులు వెకేషన్ లోనే ఉంటారు.. మిగిలిన రోజులు షూటింగ్ చేస్తారు అంటూ సరదాగా కామెంట్ చేసిన సమయంలో మహేష్ బాబు స్పందిస్తూ విహార యాత్రలకు సంబంధించి దిష్టి తగిలినట్లుంది. అందుకే రెండేళ్ల పాటు కరోనా వల్ల పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాము అన్నాడు.

వెకేషన్స్ గురించి మాట్లాడుతూ పిల్లలు పెద్ద వారు అయితే స్నేహితులు పెరిగి తల్లిదండ్రులతో ఎక్కువ సమయం స్పెండ్‌ చేసేందుకు ఆసక్తి చూపించరు. వారికి ప్రపంచం చూపించడం ద్వారా ఎన్నో విషయా తెలుస్తాయి. అందుకే మేము ఎక్కువ వెకేషన్స్ కు వెళ్తాం అన్నట్లుగా మహేష్‌ బాబు చెప్పుకొచ్చాడు. వీరిద్దరు ఇంకా ఎన్నో విషయాలను మాట్లాడుకున్నారు.