Begin typing your search above and press return to search.
రక్తం చిందించిన పవన్.. మహేశ్ ఫ్లెక్సీలు
By: Tupaki Desk | 8 Sep 2017 4:57 AM GMTగుండెల్లోని అభిమానాన్ని ఫ్లెక్సీల్లో చూపించుకోవటం తెలుగు నేల మీద కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. గతంలో ఉన్న క్లాత్ బ్యానర్ల స్థానే.. మరింత చౌకగా అందుబాటులోకి వచ్చిన ఫ్లెక్సీలతో కలర్ ఫుల్ గా ప్రింట్ చేయించి తమ అభిమానాన్నిభారీ ఎత్తున ప్రదర్శించుకోవటం ఈ మధ్యన ఫ్యాషన్ గా మారింది.
ఇదెంత వరకూ వెళ్లిందంటే.. ప్రతి చిన్న కార్యక్రమానికి అదే పనిగా ఫ్లెక్సీల మీద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ఒక అలవాటుగా మారింది. పోటాపోటీగా ఏర్పాటు చేసే ఫ్లెక్సీల కారణంగా అనవసరమైన వివాదాలు చోటు చేసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది.
తాజాగా అలాంటి రచ్చే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముమ్మిడివరం మండలంలోని అనాతవరంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ఊరేగింపు పెను ఘర్షణకు తావిచ్చింది. ఊరేగింపులో భాగంగా మహేశ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తారా జువ్వలు.. టపాసుల్ని కాల్చారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసమైంది. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఫీల్ కావటంతో వాతావరణం రచ్చ రచ్చగా మారింది.
ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం ముదిరి రాళ్లు రువ్వుకోవటం.. సోడా సీసాలు విసురుకోవటం వెళ్లింది. దీంతో.. రెండు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరస్పర దాడులతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవటమే కాదు.. రక్తం చిందేలా చేసింది. చివరకు గ్రామస్తులు కలుగజేసుకొని ఇరు వర్గాల ఫ్యాన్స్ ను శాంతింపచేశారు. అయితే.. ఈ గొడవల కారణంగా ఆరుగురికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.