Begin typing your search above and press return to search.
ఒకే దారిలో పవన్, మహేష్
By: Tupaki Desk | 13 Jan 2018 6:30 AM GMTటార్ హీరోల సినిమా విడుదలకు ముందు విపరీతమైన హైప్ తీసుకురావడం, దాన్ని ఆధారంగా చేసుకుని అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా ఏవేవో ఊహించుకుని తీరా సినిమా చూసాక నిరాశ చెందటం రొటీన్ వ్యవహారంగా మారిపోయింది. ఇక్కడ సినిమా చూసే ప్రేక్షకుడు నష్టపోతోంది కేవలం ఆ టికెట్ కు చెల్లించిన డబ్బు మాత్రమే. కాని దాని మీద నమ్మకంతో కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి లాభం రాకపోయినా పర్వాలేదు కనీసం పెట్టిన సొమ్ము వెనక్కు వస్తే చాలు - తర్వాత సినిమాతో లాభాలు చేసుకుందాం అనే డిస్ట్రిబ్యూటర్లు పరిశ్రమలో ఉండటం వల్లే ఈ సినిమాలు ఇంత భారీ ఎత్తున బిజినెస్ జరుపుకుంటున్నాయి. కాని ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి చూస్తే స్టార్ హీరో మూవీ అంటే చాలు ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితులు తలెత్తుతున్నాయి. అందులో ప్రధానంగా మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ సినిమాల గురించే ఈ ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.
అజ్ఞాతవాసి భారీ నష్టాలు మిగల్చడం ఖాయమని తేలిపోయింది. ఈ మూడు రోజులు పండగ సెలవులు ఎంత వాడుకున్నా జరిగిన వంద కోట్లకు పైగా బిజినెస్ కు తగ్గ రిటర్న్స్ ఇవ్వడం అసాధ్యమని ట్రేడ్ కి అర్థమైపోయింది. అటు ఇటుగా ఆ నష్టాల స్థాయి 50 కోట్లకు పైగా ఉంటుందని ఒక అంచనా. పవన్ గత సినిమాల్లో కాటమ రాయుడు పాతిక కోట్ల లాస్ ని కానుకగా ఇస్తే సర్దార్ గబ్బర్ సింగ్ లెక్కలు ఇప్పటికీ తేలలేదని అప్పుడప్పుడు కొందరు డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కడం చూస్తూనే ఉన్నాం. పవన్ ఇకపై సినిమాలు చేస్తాడో లేదో లేక పూర్తిగా జనసేన కార్యకలాపాల్లో బిజీ అవుతాడో చెప్పలేం కాని పవన్ సినిమాలు హ్యాట్రిక్ షాక్ కొట్టడం పూర్తయింది.
ఇక మహేష్ బాబు సైతం ఈ విషయంలో ఏమి తీసిపోవడం లేదు. స్పైడర్ నికరంగా 70 కోట్ల దాకా నష్టాలు ఇచ్చిందనే టాక్ ఇప్పటికీ చర్చల్లో నానుతూనే ఉంది,. అంతకుముందు వచ్చిన బ్రహ్మోత్సవం మొదటి ఆట అవ్వడం ఆలస్యం డిజాస్టర్ టాక్ తెచ్చుకుని ఆ సినిమా కొన్న వాళ్ళను ఏడిపించినంత పని చేసింది. మహేష్ కు ఇలా జరగడం కొత్తేమి కాదు. ఆగడు - 1 నేనొక్కడినే - సైనికుడు - అతిధి లాంటి సినిమాలు ఓవర్ హైప్ వల్లే నష్టాలు ఎక్కువగా ఇచ్చాయి. దీనికి పరిష్కారం ఒకటే. కాంబినేషన్ మీద వచ్చే క్రేజ్ కంటే కంటెంట్ మీద వచ్చే నమ్మకాన్నే పెంపొందించుకోవడం. భరత్ అను నేనుతో దీనికి బ్రేక్ పడాలి అని కోరుకుంటున్నారు సినిమా లవర్స్.