Begin typing your search above and press return to search.
మహేష్, చరణ్ ఎందుకు వదిలేశారు?
By: Tupaki Desk | 18 July 2017 9:51 AM GMTవరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ఫిదా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. దిల్ రాజు బ్యానర్ పై నిర్మాణమైన చిత్రం కావడంతో.. అన్ని కోణాల నుంచి ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నిర్మాత దిల్ రాజు అయితే.. అన్నీ తానై వ్యవహరించేస్తున్నారని చెప్పచ్చు.
హీరో హీరోయిన్స్ కంటే ఎక్కువగా దిల్ రాజు చెబుతున్న మాటలే వినిపిస్తున్నాయి. తాజాగా ఈ స్టోరీ గురించి ఓ కీలకమైన విషయాన్ని బైట పెట్టారు దిల్ రాజు. వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించినా.. ఈ మెగా హీరో తొలి ఆప్షన్ కాదట. ముందు ముగ్గురు హీరోలకు వినిపించగా.. వారందరికీ కథ విపరీతంగా నచ్చేసిందని అంటున్నారు. అయితే.. ఆ కథకు తాము సరిపోమని ఫీలయ్యారట. ముగ్గురు హీరోలు ఇదే మాట చెప్పడంతో.. అప్ కమింగ్ హీరో కోసం అన్వేషించి.. చివరకు వరుణ్ తేజ్ తో సినిమా చేసేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పారు దిల్ రాజు. అయితే.. ఆ ముగ్గురు ఎవరనే విషయాన్ని దిల్ రాజు చెప్పలేదు కానీ.. ఫిదా మూవీ స్టోరీని మొదటగా మహేష్ బాబుకు వినిపించానని.. ఇప్పటికే శేఖర్ కమ్ముల చెప్పేశారు. మరో ఇద్దరు హీరోలు.. మంచి మార్కెట్ ఉన్న యంగ్ హీరోలట. అందులో రామ్ చరణ్ కూడా ఉన్నాడనేది ఒక టాక్.
అయితే అంతమంది హీరోలు రిజక్టు చేసిన స్టోరీ.. అసలు ఇప్పుడు ఎలా ఉండబోతోంది అనేదే ఇక్కడ అందరూ ఎదరుచూస్తున్న అంశం. ఫిదా ట్రైలర్ చూస్తుంటే.. ఇందులో మహేష్ అండ్ చరణ్ వదులుకోవడానికి కారణాలు ఏంటో తెలియట్లేదు కాని.. రేపు సినిమా చూస్తే ఏమన్నా తెలుస్తాయేమో. కాకపోతే ఇలాంటి లవ్ స్టోరీలకు ఒక ఫ్రెష్ హీరో సరిపోయినంత బాగా.. సీనియర్ స్టార్లు సరిపోరులే.