Begin typing your search above and press return to search.

గురూజీ మ‌ళ్లీ సాఫ్ట్ మంత్రం జ‌పిస్తున్నారా?

By:  Tupaki Desk   |   24 Dec 2022 12:35 AM GMT
గురూజీ మ‌ళ్లీ సాఫ్ట్ మంత్రం జ‌పిస్తున్నారా?
X
ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ముందు నుంచి సాఫ్ట్ సినిమాల‌తో ఆక‌ట్టుకుంటూ వ‌స్తున్నారు. మ‌ధ్య‌లో భారీ యాక్ష‌న్ నేప‌థ్యంలో కొన్ని సినిమాలు చేసినా ఇప్పుడు మాత్రం మ‌ళ్లీ సాఫ్ట్ మంత్రం జ‌పిస్తున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా ఓ భారీ మూవీకి త్రివిక్ర‌మ్ శ్రీ‌కారం చుడుతున్న విష‌యం తెలిసిందే. SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌పైకి రానున్న ఈ మూవీ కోసం ముందు భారీ యాక్ష‌న్ స్టోరీని లాక్ చేశాడు.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఎస్‌. రాధాకృష్ణ అత్యంత భారీ స్థాయిలో ఈ మూవీని ప్లాన్ చేశారు. ఫ‌స్ట్ షెడ్యూల్ గా భారీ హెవీ డోస్ యాక్ష‌న్ ఎపిసోడ్ ని అన్బు అరివుల నేతృత్వంలో చిత్రీక‌రించారు.

ఆ త‌రువాత ఏం జ‌రిగిందో ఏమో తెలియదు కానీ స్టోరీ మొత్తం మారిపోయింది. హెవీ యాక్ష‌న్ డ్రామా కాస్తా మ‌హేష్ మార్కు సాఫ్ట్ డ్రామాగా మారింద‌ట‌. ఫైన‌ల్ స్టోరీని మ‌హేష్ కు నెరేట్ చేయ‌కుండానే త్రివిక్ర‌మ్ షూటింగ్ ని ప‌ట్టాలెక్కించాడు.

ఆ త‌రువాత ఫుల్ స్టోరీని మ‌హేష్ అడ‌గ‌డం.. త‌ను కొన్ని మార్పులు చెప్ప‌డంతో ఫైన‌ల్ గా యాక్ష‌న్ క‌థ కాస్తా సాఫ్ట్ స్టోరీగా మారిన‌ట్టుగా తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన సాఫ్ట్ ఎంట‌ర్ టైన‌ర్ `అఆ` ఇంచు మించుగా ఇదే త‌ర‌హా సాప్ట్ స్టోరీతో మ‌హేష్ ముందుకు వెళ‌దామ‌ని చెప్ప‌డం.. ఇందుకు త్రివిక్ర‌మ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డ‌మే కాకుండా టోట‌ల్ గా స్టోరీనే మార్చేయ‌డంతో కొత్త క‌థ‌తో జ‌న‌వ‌రి నుంచి మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ సెట్స్ పైకి వెళుతున్నార‌ట‌.

ఏపీ నేప‌థ్యంలో సాగే క‌థ ఇదని, మ‌హేష్ మార్కు జ‌ర్కులు, మెరుపులు వుంటూనే సాఫ్ట్ గా సాగే స్టోరీ ఇద‌ని తెలుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందించ‌బోతున్నారు. సెకండ్ హీరోయిన్ ప్లేస్ లో శ్రీ‌లీల పేరు వినిపిస్తోంది. త‌ను కాక‌పోతే ర‌ష్మిక లైన్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. జ‌న‌వ‌రి సెకండ్ వీక్ లో ప‌ట్టాలెక్క‌నున్న ఈ మూవీ కంటిన్యూగా 60 రోజుల పాటు కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకోనుంద‌ని తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.