Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: శ్రీ‌రామునిగా మ‌హేష్ రూపమిదే

By:  Tupaki Desk   |   27 May 2020 4:16 AM GMT
ఫోటో స్టోరి: శ్రీ‌రామునిగా మ‌హేష్ రూపమిదే
X
శ్రీ‌రాముడు.. శ్రీ‌కృష్ణుడు అంటే న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు ఎన్టీఆర్ రూపం క‌నిపిస్తుంది. ఇప్ప‌టికీ చాలా ఇళ్ల‌లో అన్న‌గారి స్ఫుర‌ద్రూపానికి సంబంధించిన ఫోటోలే దేవుడి మూల‌న క‌నిపిస్తుంటాయి. ఒక న‌టుడిని అంత‌గా వోన్ చేసుకోవ‌డం అన్న‌ది దేశీ సినీచ‌రిత్ర‌లో ఇలాంటిది వేరొక‌టి లేనే లేదు. ఆ పాత్ర‌ల‌కు ఆయ‌న మాత్ర‌మే సూట‌బుల్ అని ఫ్యాన్స్ న‌మ్ముతారు. ఆ త‌ర్వాత ఇంకెవ‌రికీ అలాంటి సీన్ లేదు.

అందుకే ఒక‌వేళ రామాయ‌ణం ఇప్పుడు తెర‌కెక్కితే అందులో శ్రీ‌రాముని పాత్ర‌లో న‌టించేది ఎవ‌రు? అన్న డిబేట్ సాగడం ఖాయం. సోష‌ల్ మీడియాల్లో ఫ్యాన్స్ హంగామా ఓ రేంజులోనే ఉంటుంది. ఇంత‌కుముందు బాస్ అల్లు అర‌వింద్ రామాయ‌ణం 3డిని తెర‌కెక్కిస్తార‌ని ప్ర‌చార‌మైంది. అందులో శ్రీ‌రాముని పాత్ర‌కు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోష‌న్ ని ఎంపిక చేశార‌ని.. సీత పాత్ర‌కు దీపిక‌ను ఖాయం చేశార‌ని ప్ర‌చార‌మైంది. ఒక‌వేళ ఆ సినిమా సెట్స్ కెళ్లి ఉంటే అది చ‌రిత్ర‌నే అయ్యేది.

అయితే ఇటీవ‌లి కాలంలో బాహుబలి ద‌ర్శ‌కుడు ఎస్.ఎస్.రాజ‌మౌళినే పురాణేతిహాసం రామాయ‌ణ క‌థ‌ని తెర‌కెక్కించాల‌నే అభిప్రాయం అభిమానుల్లో బలంగా వినిపిస్తోంది. మ‌హేష్ హీరోగా రాజ‌మౌళి సినిమాని ప్ర‌క‌టించ‌గానే ఒక‌వేళ ఈ ప్రాజెక్ట్ రామాయ‌ణం 3డి అయితే బావుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మైంది. ఆ త‌ర్వాత సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ ఎవ‌రికి వారు ఇమాజినేష‌న్ లోకి వెళ్లిపోయారు. మ‌హేష్ ని శ్రీ‌రామునిగా ఊహించుకుని ఆ రూపాన్ని స్కెచ్ వేసేశారు. తాజాగా అందుకు సంబంధించిన ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. మ‌హేష్ అచ్చం శ్రీ‌రాముడిలానే విల్లంబులు అందుకుని వేట‌కు సిద్ధ‌మ‌య్యాడు. ఈ మార్ఫింగ్ లుక్ అద్భుతంగానే కుదిరింది.

అయితే శ్రీ‌రాముని శ‌రీరం నీలి రంగులో త‌ళ‌త‌ళ‌లాడుతుంద‌నేది పురాణాలు చెప్పిన మాట‌. దానిని కాపీ కొట్టి అవ‌తార్ ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ ఏకంగా పండోరా గ్ర‌హ వాసుల్ని.. వారి నాయ‌కుడిని సృష్టించాడు. శ్రీ‌రాముని నీలి రంగు.. ఆంజ‌నేయుడి తోక‌ను స‌మ‌ర్థంగా వాడుకుని ఒక ఏలియ‌న్ త‌ర‌హా మాన‌వుడిని పండోరాపై సృష్టించి శ‌హ‌భాష్ అనిపించాడు. వేల కోట్ల వ‌సూళ్లకు ఈ రూపం ఎంత‌వ‌ర‌కూ సాయ‌మైందో తెలిసిందే. ఇప్పుడు రాజ‌మౌళి కి రామాయ‌ణం తెర‌కెక్కించే ఛాన్స్ ద‌క్కితే క‌చ్ఛితంగా అందులో శ్రీ‌రాముడిగా మ‌హేష్ కి అవ‌కాశం ద‌క్కితే అంత‌కంటే ఇంకేం కావాలి. కేవ‌లం మ‌హేష్- రాజ‌మౌళి‌ ఫ్యాన్స్ కే కాదు.. తెలుగు సినీహిస్ట‌రీకే మ‌ర‌పురాని జ్ఞాప‌కం అవుతుందేమో! ఒక ర‌కంగా అవ‌తార్ కి ఇండియ‌న్ వెర్ష‌న్ అవుతుందేమో!