Begin typing your search above and press return to search.
మహేష్ నటనకే ఎక్కువ అవార్డులు
By: Tupaki Desk | 15 Nov 2017 9:24 AM GMTటాలీవుడ్ లో ప్రస్తుతం నటనలో మన హీరోలు చాలా రాటుదేలారు. కమర్షియల్ హంగులతో సినిమాలను తీస్తూనే నటనకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్న కథలలో నటిస్తున్నారు. వారిలో మహేష్ బాట కూడా ఒకరని చెప్పాలి. ఎంత స్టార్ డమ్ తెచ్చుకున్నా కూడా తన ఇమేజ్ ను పక్కనపెట్టి మరి ప్రయోగాత్మకమైన సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత బాక్స్ ఆఫీస్ మార్కెట్ ఉన్న హీరోగా కూడా గుర్తింపు అందుకున్నాడు.
అయితే మహేష్ కు అవార్డులు చాలానే వచ్చాయి. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన నందులను ఈ ప్రిన్స్ చాలానే అందుకున్నారు. మొదటి సినిమా రాజకుమారుడు నుంచి శ్రీమంతుడు సినిమా వరకు మహేష్ ఎనిమిది నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. రాజకుమారుడు - అతడు - నిజం అలాగే దూకుడు సినిమాల్లో ఉత్తమ నటనను కనబరిచి అవార్డులను దక్కించుకున్నాడు. ఇక 2002 నుంచి 2005 వరకు నటించిన చిత్రాలలో మురారి- టక్కరిదొంగ - అర్జున్ సినిమాలకు స్పెషల్ జ్యూరీ కేటగిరిలో సూపర్ స్టార్ నందిలను సొంతం చేసుకున్నాడు.
ఇక రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులలో మహేష్ శ్రీమంతుడు సినిమాకి గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. ఉరిని దత్తత తీసుకునే యువకుడి పాత్రలో మహేష్ నటన ఏ స్థాయిలో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పటివరకు వచ్చిన అవార్డులలో ఎక్కువ మహేష్ బెస్ట్ యాక్టర్ గా పురస్కరాలను అందుకున్నాడు.