Begin typing your search above and press return to search.

ఆ ఒక్క సీన్ చాలా కథ చెబుతోంది

By:  Tupaki Desk   |   6 March 2018 10:33 PM IST
ఆ ఒక్క సీన్ చాలా కథ చెబుతోంది
X
భరత్ అనే నేను.. ఇప్పుడు తెలుగు జనాలంతా ఈ మూవీ విజన్ చూడ్డంలో మహా బిజీ అయిపోయారు. మహేష్ బాబు తన అభిమానులను ఊరించీ ఊరించీ.. ఎట్టకేలకు ఓ నిమిషం నిడివి ఉన్న టీజర్ ను ఇచ్చాడు. ఆశించిన స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా.. ఆ మాటకు వస్తే ఎక్స్ పెక్టేషన్స్ ను మించేలాగే ఉంది ఈ టీజర్.

మహేష్ బాబు పాత్ర ఉద్దేశ్యాన్ని పూర్తిగాను.. కథను కొద్దిగాను చెబుతూ.. అంచనాలు ఎక్కువగా ఏర్పడేలా భరత్ విజన్ ను బాగానే చూపించారు. అయితే.. ఈ టీజర్ లో చెప్పుకోవాల్సిన సీన్ మాత్రం ఒకటి ఉంది. రోడ్ సైడ్ ఓ సిమెంటు గచ్చు మీద కూర్చున్న కుర్రాడు.. పుస్తకం చదువుకుంటూ ఉంటాడు. వెనకాల ఎండుమిర్చి ఆరబోసి ఉండగా.. పక్కనే ఓ సైకిల్ పార్క్ చేసి ఉంటుంది. దానికి క్యారేజ్ లు తెచ్చుకునే బుట్ట కూడా తగిలించి ఉంటుంది. ఆ కుర్రాడి పక్కనే మెట్టు పై కూర్చుని ఏదో మహేష్ ఏదో మాట్లాడుతున్న సీన్ అని అర్ధమవుతుంది.

టీజర్ లో ఎలివేషన్ షాట్స్ తో పాటు.. సింపుల్ గా కనిపిస్తున్న ఈ సన్నివేశాన్ని చూస్తుంటే.. మూవీకి కీలకమైన సన్నివేశంగాను.. హీరో పాత్రకు ఓ విజన్ ఏర్పడే సిట్యుయేషన్ గాను అనుకోవచ్చు. సామాన్యమైన ఓ కుర్రాడి పక్కన సీఎం కూర్చునే సన్నివేశాన్ని చూపించిన తీరు మాత్రం చాలా బాగుంది. ఈ సీన్ లో ఉన్న ఇంటెన్సిటీ చూస్తుంటే చిన్న చిన్న సన్నివేశాలతో కథను ఎలా రక్తి కట్టించాలో అనే విషయం కొరటాలకు తెలిసినట్లుగా బహుశా ఇంకెవరికీ తెలీదేమో అనిపించక మానదు.