Begin typing your search above and press return to search.
హెడ్ ఫోన్స్ లో.. భరత్ అను నేను
By: Tupaki Desk | 23 Jan 2018 8:39 PM ISTహెడ్ ఫోన్స్ ను సిద్ధం చేసుకోండి. ఇంతవరకు సినిమా విడుదలకు ముందు ఫస్ట్ లుక్ మాత్రమే విడుదల చేసే వారు... ఇప్పుడు ఫస్ట్ ఆడియో కూడా వచ్చేస్తుంది. ఈ కొత్తదనానికి తెరతీస్తోంది దర్శకుడు కొరటాల శివ. ఆయన మాట విని హెడ్ ఫోన్స్ తో సిద్ధంగా ఉండండి... మరో మూడు రోజుల్లో కొత్త సీఎంగారి ప్రమాణ స్వీకారం వినడానికి.
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు భరత్ అను నేను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు అన్ని హంగులు సమకూర్చుకుంటోంది. ఆ సినిమా పేరును ఇంత వరకు అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించలేదు. తొలిసారి జనవరి 26న ప్రకటించబోతోంది. టైటిల్ లోగోతో పాటూ మహేష్ బాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను కూడా విడుదల చేయబోతున్నారు. సో... అభిమానులంతా సిద్ధంగా ఉండాలంటూ దర్శకుడు కొరటాల శివ ట్విట్టర్లో కోరారు.
ట్విట్టర్లో పోస్టు వచ్చిన కొన్ని గంటల్లోనే వైరల్ అయిపోయింది. గూగుల్ ఇండియా ట్రెండ్స్ లో ఈ విషయం రెండో స్థానంలో నిలిచింది. దీనిని బట్టి చూస్తుంటే భరత్ అను నేను ఆడియో కూడా రికార్డు నెలకొల్పడం ఖాయంలా ఉంది. ఇంతవరకు సినిమా విడుదల తేదీ మాత్రం ఖరారు కాలేదు. అది కూడా జరిగి మహేష్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతుందేమో చిత్ర యూనిట్.