Begin typing your search above and press return to search.

మహేష్ ఫస్ట్ లుక్ ఇప్పుడే కాదట

By:  Tupaki Desk   |   12 Jan 2018 11:20 AM IST
మహేష్ ఫస్ట్ లుక్ ఇప్పుడే కాదట
X
హ్యాండ్సమ్ లుక్ తో ఎక్కువా స్టార్ ఇమేజ్ ను అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే అందరికి ఇష్టమే. సినిమాలు ఫ్యామిలీ తప్ప ఇతర ప్రపంచంలోకి వెళ్లడానికి ఎక్కువగా ఇష్టపడని ఈ హీరో ఇప్పుడు పాలిటిక్స్ కథను చేస్తోన్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను సినిమాపై ప్రస్తుతం భారీ అంచనాలు ఉన్నాయి. అందులోను శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండడంతో సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నారు.

దీంతో సినిమాపై ఎలాంటి న్యూస్ వచ్చినా అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇకపోతే సినిమా ఫస్ట్ లుక్ కోసం కూడా గత కొంత కాలంగా అనేక రూమర్స్ వస్తున్నాయి. సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది అని అంతా అనుకున్నారు. చిత్ర యూనిట్ ని నుంచి కూడా ఒక అప్డేట్ రావడంతో అందరూ ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఫస్ట్ లుక్ ఇప్పుడు లేదని తెలుస్తోంది. సినిమా రిలీజ్ డేట్ ను సమ్మర్ కి ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇంకా సినిమా రావడానికి చాలా టైమ్ ఉందని దర్శకనిర్మాతలు చర్చించుకుని వాయిదా వేశారు అనే టాక్ వినిపిస్తోంది.

అయితే కొన్ని నెలల క్రిందట సినిమాలోని ఒక లుక్ రిలీజ్ అయ్యి అందరిని బలే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు సంక్రాంతి కి కూడా ఒక లుక్ వస్తే బావుంటుందని అనుకున్నారు. కానీ మహేష్ టీమ్ సడన్ గా నిర్ణయం మార్చుకుంది. మార్చ్ నుంచి సినిమాకి సంబంధించిన హదవుడిని స్టార్ చేయాలని చిత్రం యూనిట్ అనుకుంటోంది. అంచనాలు కూడా మరి ఎక్కువగా పెంచవద్దు అని కూడా ఆలోచిస్తున్నారట. కానీ ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. మరి ఆ స్థాయి వరకు భరత్ టీమ్ వెళుతుందో లేదో చూడాలి.