Begin typing your search above and press return to search.

భరతుడికి పవనుడి బ్రేక్

By:  Tupaki Desk   |   21 April 2018 10:55 AM IST
భరతుడికి పవనుడి బ్రేక్
X
నిన్న విడుదలై ఫుల్ పాజిటివ్ టాక్ తో జోష్ లో ఉన్న భరత్ అనే నేను ఓపెనింగ్స్ పరంగా రికార్డు సృష్టించింది కాని ఫాన్స్ మాత్రం ఓ చిన్న అసంతృప్తితో ఉన్నారు. అదే ట్రెండింగ్. పక్కా స్కెచ్ తో నెలన్నర క్రితమే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని మంచి సీజన్ లో హాలిడే వీక్ ఎండ్ చూసుకుని వచ్చిన మహేష్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఉండే వాతావరణం నిజంగా నిన్న సోషల్ మీడియాలో కనిపించలేదు. దానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి పవన్ కళ్యాణ్ తనకు వర్మకు రేగిన వివాదం గురించి పరిష్కారం చూపాలంటూ ఫిలిం ఛాంబర్ కు మెగా హీరోలందరితో సహా మకాం వేసి తీవ్ర స్థాయిలో నిరసన చూపడంతో మెగా ఫాన్స్ దృష్టి మొత్తం ఆటే ఉంది. మహేష్ అంటే సాఫ్ట్ కార్నర్ ఉన్నా వాళ్ళు సినిమా చూసే మూడ్ లో లేరు. పైగా అక్కడ జరిగిన సంఘటనకు సంబందించి ఫోటోలు వీడియోలు విపరీతంగా షేర్ కావడం మొదలయ్యాయి. దీంతో భరత్ అనే నేను టాక్ బలంగా వెళ్ళలేదు.

మరో కారణం ఎపి సిఎం చంద్రబాబునాయుడు ధర్మ దీక్ష. ముఖ్యమైన ఛానల్స్ అన్ని ఉదయం నుంచి సాయంత్రం దాక నాన్ స్టాప్ గా లైవ్ కవరేజ్ ఇవ్వడంతో భరత్ అనే నేను విడుదలైన థియేటర్ల పరిస్థితి ఎంత హడావిడిగా ఉందో, చూసిన వాళ్ళ రియాక్షన్ ఏంటో చూపించే ప్రయత్నం చేయలేకపోయాయి. ఈ రెండు విషయాల నేపధ్యంలో భరత్ అనే టాక్ ప్రజల్లోకి అనుకున్న స్థాయిలో వెళ్ళలేకపోయింది. హిట్ టాక్ వచ్చినా కూడా నిన్నంతా జనం ఆ రెండు విషయాల మీద చర్చలు పెట్టడంతో భరత్ అనే నేను ఎలా ఉందంట అనే ప్రశ్న ఉత్పన్నం కాలేదు. అందుకే టాప్ 3 ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నా భరత్ మాత్రం టాప్ 10 తర్వాతే చోటు దక్కించుకున్నాడు. దీన్ని బట్టి నిన్న ఆ రెండు విషయాలు ఎంత తీవ్ర ప్రభావం చూపించాయో అర్థం చేసుకోవచ్చు.ఓవర్సీస్ లో ఒకటిన్నర మిలియన్ ఒక్క ప్రీమియర్ల ద్వారానే రాబట్టింది అనే వార్తల నేపధ్యంలో ఓపెనింగ్స్ కి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది.