Begin typing your search above and press return to search.
అటూ ఇటూ తిరిగి ఇక్కడే భరత్
By: Tupaki Desk | 28 March 2018 5:01 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లోనే ఎప్పుడు లేనంతగా భరత్ అనే నేను సినిమా భారీ అంచనాలను రేపుతోన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా సినిమా సందడి మాములుగా లేదు. సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం బయటకు వచ్చిన కూడా ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. టీజర్ మరియ మొదటి పాట ఇప్పటికే అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక నెక్స్ట్ భరత్ అనే నేను టీమ్ మరో ప్లాన్ తో రెడీ అయ్యింది.
సినిమా ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాలోని చివరి పాటల కోసం మహేష్ టీమ్ విదేశాలకు వెళ్లింది. స్పెయిన్ లో షూట్ చేస్తున్నారు. రెండు పాటలు అయిపోతే సినిమా పనులు దాదాపు ఎండ్ అయినట్లే. ఇక భరత్ అనే నేను ప్రొడక్షన్ టీమ్ మాత్రం ప్రీ రిలీజ్ కి ఏర్పాట్లు చేయడంలో బిజీగా వుంది. మొదట వేడుకను వైజాగ్/విజయవాడ లో ప్లాన్ చేద్దామని అనుకున్నారు. కానీ ఎందుకో మరి చివరి నిమిషంలో ప్లాన్ చేంజ్ చేశారు. హైదరాబాద్ లోనే అభిమానులకు సౌకర్యంగా ఉండేలా ఈవెంట్ ను సిద్ధం చేయాలని అనుకుంటున్నారు.
ఇక డేట్ విషయనికి వస్తే.. మొన్నటి వరకు ఏప్రిల్ రెండవవరం తరువాత ప్రీ రిలీజ్ వేడుకను ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియాలో కొన్ని కథనాలు వెలువడ్డాయి. కానీ చిత్ర యూనిట్ ఆ రూమర్స్ కి చెక్ పెడుతూ.. ఏప్రిల్ 7న ఫిక్స్ చేసినట్లు సమాచారం. అప్పటిలోపు వీలైనంత వరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫినిష్ చేయాలని దర్శకుడు కొరటాల శివ డిసైడ్ అయ్యాడు. ఆంద్రప్రదేశ్ రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కాని ప్రీరిలీజ్ విషయంలో మాత్రం అటూ ఇటూ తిరిగి చివరకు హైదరాబాదే రావడం కాస్త ఆశ్చర్యంగా ఉంది.