Begin typing your search above and press return to search.

చరణ్ కొట్టాడు.. మహేష్ ఫ్యాన్స్ ఫీలవ్వక్కర్లేదు

By:  Tupaki Desk   |   7 April 2018 11:00 PM IST
చరణ్ కొట్టాడు.. మహేష్ ఫ్యాన్స్ ఫీలవ్వక్కర్లేదు
X
రామ్ చరణ్ కొత్త సినిమా ‘రంగస్థలం’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తోంది. ఈ చిత్రం తొలి వారంలోనే రూ.70 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ షేర్ సాధించిన సంగతి తెలిసిందే. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక మిగతా ఏరియాల్లోనూ ఈ చిత్రం అదరగొట్టేస్తోంది. క్లాస్ సినిమాలకే పట్టం కడతారని పేరున్న అమెరికాలో మాస్ టచ్ ఉన్న ‘రంగస్థలం’ తొలి వీకెండ్లోనే 2 మిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం విశేషం. వీకెండ్ తర్వాత కూడా ఓ మోస్తరుగా వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం నాన్-బాహుబలి రికార్డును ఖాతాలో వేసుకోవడం విశేషం. శుక్రవారం సెకండ్ షోలు పూర్తయ్యే సమయానికి ‘రంగస్థలం’ వసూళ్లు 2.86 మిలియన్ డాలర్లకు చేరుకునున్నాయి. 2.89 మిలియన్ డాలర్లతో ‘శ్రీమంతుడు’ నెలకొల్పిన నాన్-బాహుబలి రికార్డును శనివారం కోసం జరిగిన ప్రి సేల్స్ తో ఆల్రెడీ ‘రంగస్థలం’ దాటేసినట్లు సమాచారం.

మొత్తానికి 30 నెలలకు పైగా నిలిచిన ఉన్న రికార్డు బద్దలైపోయింది. ఐతే ‘శ్రీమంతుడు’ రికార్డు బద్దలైపోయిందని మహేష్ ఫ్యాన్స్ ఫీలవ్వాల్సిన పని లేదు. ఇంకో రెండు వారాల్లోపే మహేష్ కొత్త సినిమా ‘భరత్ అనే నేను’ ప్రేక్షకుల ముందుకొస్తోంది. దీనిపై అంచనాలు మామూలుగా లేవు. ఇది ‘శ్రీమంతుడు’ కాంబినేషన్లోనే తెరకెక్కిన సినిమా. కొరటాల చిత్రమంటేనే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం ఉంటుంది. ఈ చిత్రం ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా వసూళ్ల మోత మోగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు అమెరికాలో భారీ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. 300 లొకేషన్లలో 2 వేలకు పైగా ప్రిమియర్ షోలు ప్లాన్ చేస్తున్నారీ చిత్రానికి. ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ల క్లబ్బులోకి చేరడం లాంఛనమే కావచ్చు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే 3 మిలియన్ డాలర్లేంటి.. 4-5 మిలియన్ డాలర్లు కూడా వసూలు చేయొచ్చు. కాబట్టి ఈ చిత్రానికి ఎలాంటి టాక్ వస్తుందో చూద్దాం.