Begin typing your search above and press return to search.
అదే లుంగీ.. అవే స్టెప్పులా భరత్?
By: Tupaki Desk | 4 April 2018 7:08 PM ISTమహేష్ బాబు చాలా విషయాల్లో కొత్తగా ట్రై చేస్తుంటాడు. దర్శకులను ఎంచుకోవడం విషయంలో ప్రయోగాలు చేసేందుకు కూడా రెడీగానే ఉంటాడు. కథల విషయంలో కూడా దర్శకులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు. కానీ గతంలో ఇలా చేసినవన్నీ బెడిసికొట్టడంతో ఇప్పుడు పెద్దగా ప్రయోగాలు చేయడం మానేశాడనే చెప్పాలి.
ఇప్పుడు భరత్ అనే నేను మూవీ విషయంలో కూడా మహేష్ డ్యాన్సుల పరంగా పెద్దగా ఇంప్రూవ్ మెంట్ ఎక్స్ పెక్ట్ చేయాల్సిన అవసరం కనిపించడం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. ప్రమోషన్స్ తూతూమంత్రంగా కానిచ్చేస్తుంది టీం.. 'వచ్చాడయ్యా సామీ' అనే పాటను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 5న సాయంత్రం 5గంటలకు ఈ లిరికల్ సాంగ్ ను విడదల చేయనున్నారు. కానీ డ్యాన్సుల దగ్గర మాత్రం సూపర్ స్టార్ చాలా చాలా వీక్. అందుకే చిన్నపాటి స్టెప్పులు.. ప్యాంట్ లో చీమలు దులుపుతున్నట్లుగా డ్యాన్సులు చేసేసి తూతూమంత్రంగా కానిచ్చేస్తూ ఉంటాడు.
ఇదే సంగతి సాంగ్ రిలీజ్ పోస్టర్ లో తెలిసిపోతూనే ఉంది. మహేష్ తలకు పాగా చుట్టడం మినహాయిస్తే.. పిసరంత కూడా కొత్తదనం కనిపించదు. మహేష్ ట్రేడ్ మార్క్ స్టెప్పులేవో తాను వేసుకుంటుంటే చుట్టుపక్కల ఉన్నవాళ్లు తందానా అంటున్నారు. ఇక ఇలా లుంగీ పైకి కట్టడాన్ని కూడా అభిమానులు శ్రీమంతుడు మూవీలోనే చూసేశారు. కాకపోతే ఇక్కడ సీఎం పాత్ర కావడంతో వైట్ అండ్ వైట్ లో కనిపిస్తున్నాడంతే.