Begin typing your search above and press return to search.
మహేష్ -జక్కన్న బాలీవుడ్ స్కెచ్?
By: Tupaki Desk | 19 Nov 2018 6:10 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాలీవుడ్ ఎంట్రీకి భారీ స్కెచ్ వేస్తున్నారా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. మహేష్ బాలీవుడ్ డెబ్యూకి గతంలో ఎన్నో ఛాన్సులు వచ్చినా ఎందుకనో ఆసక్తి కనబరచలేదు. తొలుత టాలీవుడ్ లో తన స్థానాన్ని స్థిరపరుచుకున్న తర్వాతనే ఇతర భాషల్లో ప్రయోగాలు చేయాలని భావించిన మహేష్ బాలీవుడ్ సహా ఇతర భాషల్లో నటించాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ప్రస్తుతం మహేష్ సౌతిండియాలోనే ఎదురే లేని స్టార్. అతడు తన ప్రభను అతిపెద్ద మార్కెట్ ఉన్న బాలీవుడ్ కి - ఉత్తరాదికి విస్తరించాల్సిన సమయం ఆసన్నమైంది. మారిన ట్రెండ్ లో సౌతిండియా స్టార్లు ఇరుగు పొరుగు భాషల్లోనూ పాపులారిటీ పెంచుకుంటున్నారు. అందుకే తాను కూడా ఆ దిశగా సీరియస్ గానే ఆలోచించిన మహేష్ ప్రణాళికల్లో వేగం పెంచారు.
అయితే మహేష్ లాంటి అసాధారణ ఛరిష్మా ఉన్న స్టార్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలంటే లాంచింగ్ అంతే ఘనంగా ఉండాలన్నది తొలి నుంచి ప్లాన్. అందుకే గత రెండు మూడేళ్లుగా ఆ ఆలోచన ఉన్నా సరైన సమయం కోసం మహేష్ వేచి చూస్తున్నారు. ప్రస్తుతం అన్ని భాషల్లోనూ సీన్ మారుతోంది. మన హీరోలు యూనివర్శల్ మార్కెట్లను కొల్లగొట్టేందుకు మార్కెట్ ని డబులు - ట్రిపుల్ కి విస్తరించేందుకు తెలివైన గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
మహేష్ లాంటి స్టార్ యూనివర్శల్ అప్పీల్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలంటే ఎస్.ఎస్.రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ బరిలో దిగితేనే బావుంటుందన్నది ఓ ప్లాన్ అని తెలిసింది. ఆ క్రమంలోనే మహేష్ - రాజమౌళి సినిమా గురించి గత రెండు మూడేళ్లుగా ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే ఆ ఇద్దరి కలయిక మాత్రం సాధ్యపడడం లేదు. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి వినిపించిన లైన్ ని మహేష్ ఓకే చెప్పారు. ఇక దానిని పూర్తిగా స్క్రిప్టుగా మలిచి సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంటుందిట. నేడు(సోమవారం) జక్కన్న ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం కోసం సుదీర్ఘమైన సమయం వెచ్చిస్తున్నారు. 2020లోనే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ఉంటుంది. అంటే అప్పటివరకూ మహేష్ వేచి చూడాల్సి ఉంటుంది. ఇకపోతే బాహుబలి సిరీస్ తో వరల్డ్ ఫేమస్ అయిన రాజమౌళి నిర్ధేశనంలో మహేష్ బాలీవుడ్ ఎంట్రీ పెర్ ఫెక్ట్ గా ఉంటుందని నమ్రత మహేష్ - సూపర్ స్టార్ కృష్ణ బలంగా నమ్మి ఆ దిశగానే మహేష్ ని ప్రోత్సహిస్తున్నారని తెలుస్తోంది. ఓ ప్రముఖ పత్రికలో రాజమౌళి తో మహేష్ సినిమా అంటూ వచ్చిన కథనం అందుకు ఊతమిస్తోంది. ఎట్టిపరిస్థితిలో రాజమౌళితో పని చేయాలన్న ఆసక్తితో మహేష్ తెరవెనక టీమ్ ఫీలర్స్ ని వదులుతోందన్న మాటా ప్రస్తుతం ఫిలింనగర్ వర్గాల్ని వేడెక్కిస్తోంది.