Begin typing your search above and press return to search.
మహేష్ టార్గెట్ ఫిక్సయింది
By: Tupaki Desk | 6 Feb 2016 11:30 AM GMTబాహుబలి సినిమా కేటగిరి వేరు కాబట్టి దాన్ని పక్కనబెట్టేద్దాం. మామూలుగా అయితే యుఎస్ బాక్సాఫీస్ లో మహేష్ బాబు తర్వాతే ఎవరైనా. అసలు అమెరికాలో తెలుగు సినిమాకు మార్కెట్ తెచ్చిన ఘనతే మహేష్ ది. ‘దూకుడు’ సినిమాతో అక్కడ వసూళ్ల ప్రభంజనానికి తెరతీసి.. అందరూ తనను అనుసరించేలా చేశాడు. 1 నేనొక్కడినే - ఆగడు లాంటి డిజాస్టర్లతో కూడా మిలియన్ క్లబ్బుని అందుకున్న ఘతన మహేష్ దే. ఇక పాజిటివ్ టాక్ వస్తే మహేష్ కు అడ్డేముంటుంది చెప్పండి. ‘శ్రీమంతుడు’ సినిమా 2.8 మిలియన్లు వసూలు చేసి ఔరా అనిపించింది. దీంతో మహేష్ కొత్త సినిమా ‘బ్రహ్మత్సవం’ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి అమెరికాలో.
సినిమా మొదలైనప్పటి నుంచి యుఎస్ నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి ‘బ్రహ్మోత్సవం’కి. ఐతే కొన్నాళ్లు వెయిట్ చేద్దామని చూశాడు నిర్మాత పొట్లూరి వరప్రసాద్. ఇప్పుడు సినిమాను ఓ డిస్ట్రిబ్యూటర్ రూ.13 కోట్లకు అడుగుతున్నట్లు సమాచారం. ఇంకా డీల్ ఫైనలైజ్ కాలేదు కానీ.. కాస్త అటు ఇటుగా ఓకే అయ్యే అవకాశముంది. నిజంగా రూ.13 కోట్లకు కొంటే సినిమా 3 మిలియన్లకు పైనే అంటే దాదాపు రూ.20 కోట్ల దాకా కలెక్ట్ చేస్తేనే బయ్యర్ లాభాల్లోకి వస్తాడన్నమాట. ఎలాగూ ‘శ్రీమంతుడు’ 2.8 మిలియన్లతో మహేష్ కు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 3 మిలియన్ క్లబ్బు అందుకోవాల్సిందే. ఇక సినిమాకు వచ్చిన రేటు కూడా అదే టార్గెట్ అంటోంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే అదేం పెద్ద కష్టం కాకపోవచ్చులెండి.