Begin typing your search above and press return to search.
మహేష్.. అక్కడికి వెళ్తున్నాడు
By: Tupaki Desk | 12 Oct 2015 7:48 AM GMTఈ మధ్య సీరియల్ జనాలు సైతం షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లిపోతున్నారు కానీ ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు సైతం విదేశాల్లో షూటింగ్ అంటే అమ్మో అనుకునేవాళ్లు. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పైగా మన దగ్గరా బ్రహ్మాండమైన లొకేషన్స్ ఉండగా.. అక్కడి వెళ్లాల్సిన అవసరం ఏంటని అనుకునేవాళ్లు. ఇండియాలోనే కాశ్మీర్ రూపంలో ఓ భూతల స్వర్గం ఉండగా.. మళ్లీ ఏ స్విట్జర్లాండో వెళ్లడం ఎందుకనుకునేవారు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. కాశ్మీర్ అందాలు.. స్విట్జర్లాండుకే కాదు, ఏ దేశానికి కూడా తీసిపోవు. కాకపోతే అక్కడ షూటింగ్ చేయడం రిస్క్ అని ఇంతకుముందులా అక్కడ షూటింగులు జరగట్లేదు. ఐతే స్క్రిప్టు డిమాండ్ చేస్తే ఇప్పటికీ అక్కడికి వెళ్లి చాలామంది షూట్ చేసుకొస్తున్నారు.
తెలుగు సినిమాల విషయానికొస్తే ఈ మధ్య కాలంలో ఏ మూవీ కూడా కాశ్మీర్లో షూటింగ్ జరుపుకున్న దాఖలాలు లేవు. ఐతే మహేష్ లాంటి పెద్ద హీరో తన యూనిట్ తో కలిసి షూటింగుకి బయల్దేరుతున్నాడన్న వార్త ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ షెడ్యూల్ అయ్యాక టీం అంతా కాశ్మీర్ బయద్దేరుతోందట. స్క్రిప్టు డిమాండ్ చేయడం వల్లే అక్కడ షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. మహేష్ అడ్డు చెప్పకుండా కాశ్మీర్ బయల్దేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ షెడ్యూల్ షూటింగ్ చాలా ఖర్చు, రిస్క్ తో కూడుకున్నదైనా.. పీవీపీ సంస్థ ఏమాత్రం వెనుకంజ వేయట్లేదు. ఓ మూడు వారాల పాటు కాశ్మీర్లో ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ జరుగుతుందని సమాచారం.