Begin typing your search above and press return to search.
మహేష్.. మెగా బాక్సు బద్దలు కొట్టాడు
By: Tupaki Desk | 18 May 2016 9:49 AM GMTతెలుగు సినిమా ఒకప్పుడు మన ఉమ్మడి రాష్ట్రాన్ని దాటి వేరే చోట రిలీజవ్వడమే గగనం. అలాంటిది ఈ రోజు కోట్లకు కోట్లు బిజినెస్ చేస్తోంది. అమెరికాలో ‘బాహుబలి’ ఏకంగా రూ.50 కోట్ల దాకా వసూలు చేసి ఆశ్చర్యపరిచింది. మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు కూడా మిలియన్ డాలర్లు ఈజీగా కలెక్ట్ చేస్తున్నాయి. అక్కడ రూ.10 కోట్లకు అటు ఇటుగా బిజినెస్ జరుగుతోంది స్టార్ హీరోల సినిమాలకు. ఇక డొమెస్టిక్ లెవెల్లో కర్ణాటక తెలుగు సినిమాలకు మాంచి మార్కెట్ అవుతోంది. ఇక్కడ మెగా హీరోల సినిమాలకు అంతకంతకూ మార్కెట్ పెరుగుతోంది. సర్దార్ గబ్బర్ సింగ్-సరైనోడు రెంటికీ అక్కడ రూ.6 కోట్లకు అటు ఇటుగా బిజినెస్ అయింది.
ఐతే మహేష్ కూడా తానేమీ తక్కువ తినలేదని రుజువు చేశాడు. ‘బ్రహ్మోత్సవం’ కర్ణాటక హక్కులు ఏకంగా రూ.6.75 కోట్లకు అమ్ముడవడం విశేషం. తెలుగు సినిమాలకు ఇదే రికార్డు. మెగా హీరోల రికార్డులన్నీ బద్దలైపోయాయి. ‘సరైనోడు’ లాంటి డివైడ్ టాక్ వచ్చిన సినిమానే కర్ణాటకలో రూ.7.2 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక ‘బ్రహ్మోత్సవం’ లాంటి ఫుల్ పాజిటివ్ బజ్ ఉన్న సినిమాకు హిట్ టాక్ వస్తే రూ.10 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యమేమీ లేదు. అందుకే బృంద అండ్ కో సంస్థ అంత మొత్తం పెట్టి రైట్స్ తీసుకుంది. కర్ణాటకలో మహేష్ కెరీర్లోనే అత్యధిక థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. తొలి రోజు బెంగళూరులో భారీ స్థాయిలో స్పెషల్ షోలు ప్లాన్ చేశారు. మరి పెట్టుబడి మీద ఈ సినిమా ఎంత లాభం తెచ్చిపెడుతుందో చూడాలి.