Begin typing your search above and press return to search.
మహేష్ పరువు అక్కడా పోగొడతారా?
By: Tupaki Desk | 4 Aug 2018 8:05 AM GMTతమిళ నాట మార్కెట్ పెంచుకుందామని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు మహేష్ బాబు. ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని డబ్ చేసి పెద్ద ఎత్తున రిలీజ్ చేయించాడు. ఈ చిత్రాన్ని స్వయంగా ప్రమోట్ చేశాడు కూడా. ఆ తర్వాత నేరుగా తమిళంలో ‘స్పైడర్’ సినిమా కూడా చేశాడు. ఆ సినిమా ఆడకపోయినా మహేష్ టాలెంట్ ఏంటో తమిళ జనాలకు తెలిసేలా చేసింది. ఈ ఊపులో ‘భరత్ అనే నేను’ సినిమాను తమిళనాట రిలీజ్ చేస్తే మంచి వసూళ్లు సాధించింది. మహేష్ కు తమిళనాట హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను కూడా చక్కగా ప్లాన్ చేసి తమిళంలో రిలీజ్ చేయాలని మహేష్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి టైంలో మహేష్ కు ఒక తలనొప్పి తప్పేలా లేదు. అతడి ప్రణాళికలకు గండికొట్టే సినిమా తమిళనాట రిలీజవుతోంది.
మహేష్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని ఈ నెల 10న తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడానికి ముందే తమిళంలోనూ విడుదలకు ఒప్పందం కుదిరింది. అదేదో తెలుగు వెర్షన్ తో పాటుగా రిలీజ్ చేసేస్తే పోయేది. కానీ తెలుగులో ఈ చిత్రం ఘోర పరాజయం చవిచూశాక.. దాని తాలూకు చేదు జ్ఞాపకాల్ని మరిచిపోతున్న తరుణంలో ఇప్పుడు ఇంత ఆలస్యంగా దాన్ని రిలీజ్ చేయడమేంటో అర్థం కావడం లేదు. అది కూడా కమల్ హాసన్ సినిమా ‘విశ్వరూపం-2’ భారీ అంచనాలతో రిలీజవుతున్న రోజే తమిళంలో ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ‘బ్రహ్మోత్సవం’ కేవలం డిజాస్టర్ కావడం కాదు.. మహేష్ పరువు తీసింది. ఈ సినిమా విషయంలో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు మహేష్. ఇక్కడ పోయిన పరువు చాలదన్నట్లు తమిళంలోనూ దాన్ని రిలీజ్ చేసి అతడి ఇమేజ్ డ్యామేజ్ చేసేలా ఉన్నారు. ఆడదని తెలిసి కూడా ఈ సినిమాను ఎందుకు రిలీజ్ చేస్తున్నారో మరి. తమిళ నాట కొంచెం కొంచెం ఫాలోయింగ్ పెంచుకుంటున్న మహేష్ కు ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ ఇబ్బందికరం అనడంలో సందేహం లేదు.