Begin typing your search above and press return to search.
గురువారం రాత్రే ఓవర్సీస్ లో ‘బ్రహ్మోత్సవం’
By: Tupaki Desk | 17 May 2016 6:04 AM GMTమహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ పనులు చక చకా సాగిపోతున్నాయి. మొన్న ఆడియో రిలీజైంది మొదలు.. సినిమా ప్రమోషన్ అంతా రెండు వారాల వ్యవధిలోనే కంప్లీట్ అయిపోయింది. నిన్ననే సెన్సార్ కూడా పూర్తయింది. క్లీన్ U సర్టిఫికెట్ పొందిన బ్రహ్మోత్సవం... ఇక ఓవర్సీస్ లో హల్ చల్ చేయడానికి రెడీ అయిపోయింది. ఈ చిత్రాన్ని నిర్మాతలు ఓవర్సీస్ లో ప్రదర్శించడానికి కంటెంట్ ను కూడా విమానం ఇక్కించేశారు. సెన్సార్ లేట్ అవుతుందేమో అనుకున్నారంతా. దాని వల్ల ఇన్ టైమ్ లో ఓవర్సీస్ లో షోస్ పడవేమోననే ఆందోళన ఇటు అభిమానులతో పాటు.. అటు చిత్ర యూనిట్ సభ్యుల్లో వుండేది. అయితే సకాలంలో సెన్సార్ పూర్తవడంతో వేగంగా బ్రహ్మోత్సవం మూవీ హార్డ్ డిస్క్ లను విమానం ఎక్కించేశారు.
ఇప్పటికే మహేష్ బాబు ప్రత్యేకంగా మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేశాడు. ఓ వైపు సోషల్ నెట్ వర్క్ ప్రచారాన్ని నమ్రత అండ్ టీమ్ చూసుకుంటోంది. పి.వి.పి.సంస్థతో కలిసి మహేష్ బాబు ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. దాంతో ఎక్కడా తగ్గకుండా సినిమా ప్రమోషన్ ను చేస్తున్నాడు మహేష్. ఇక రిలీజ్ కావడమే తరువాయి. ఇప్పటికే బ్రహ్మోత్సవానికి కావాల్సినంత పాజిటివ్ బజ్ వచ్చేసింది. శ్రీమంతుడు హిట్ తో వందకోట్ల మార్కును అందుకున్న మహేష్.. ఈ చిత్రంతోనూ అదే మార్క్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు.