Begin typing your search above and press return to search.
షాకింగ్ : మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూత
By: Tupaki Desk | 8 Jan 2022 4:35 PM GMTసూపర్ స్టార్ కృష్ణ తనయుడు, స్టార్ హీరో మహేష్ బాబు సోదరుడు.. ఒకనాటి హీరో రమేష్ బాబు (56) శనివారం కన్నుమూశారు. ఈ వార్త ఘట్టమనేని అభిమానుల్ని షాక్ కు గురిచేస్తోంది. కాలేయ సంబంధిత వ్యాధిలో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనని కుటుంబ సభ్యులు హుటా హుటిన గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే రమేష్ బాబు మృతిచెందినట్టు డాక్టర్లు దృవీకరించారు. రమేష్ బాబు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు` చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత కృష్ణ, మహేష్ బాబుతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. నటుడిగా మొత్తం 15 సినిమాల్లో నటించారు.
1987లో వచ్చిన `సామ్రాట్` చిత్రం రమేష్ బాబు హీరోగా నటించిన తొలి చిత్రం. ఇందులో సోనమ్ హీరోయిన్ గా నటించింది. ఏ.కోదండ రామిరెడ్డి రూపొందించిన `బజారు రౌడీ`, కృష్ణ డైరెక్ట్ చేసిన `ముగ్గురు కొడుకులు`, దాసరి నారాయణరావు రూపొందించిన `బ్లాక్ టైగర్`, శంకర్ తెరకెక్కించిన `ఎన్ కౌంటర్` చిత్రాలు రమేష్ బాబు కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
అయితే ఎందుకో ఆయన 1997 నుంచి రమేష్ బాబు సినిమాకు దూరంగా వుంటూ వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే గుడ్ బై చెప్పారు. అయితే మహేష్ ప్రోత్సాహంతో 2004లో నిర్మాతగా మారారు. మహేష్ హీరోగా రమేష్ బాబు అర్జున్, `అతిథి` చిత్రాలని నిర్మించారు. ఆ తరువాత మళ్లీ సినిమాల వైపు చూడలేదు. కనీసం మహేష్ సినిమాల ఫంక్షన్ లకు కూడా రాకుండా ఇండస్ట్రీలో వున్నా ఇండస్ట్రీకి దూరంగానే వుంటూ వచ్చారు. అలాంటి రమేష్ బాబు హఠాత్తుగా మృతి చెందడం పలువురిని షాక్ కు గురిచేసింది.