Begin typing your search above and press return to search.
నాకు తెలిసి సితార గొప్ప హీరోయిన్ అవుతుంది: మహేశ్
By: Tupaki Desk | 9 May 2022 10:51 AM GMTఈ మధ్య కాలంలో కథ ఏమిటనేది గెస్ చేయడానికి వీల్లేని టైటిల్ ఏదైనా ఉందంటే, అది 'సర్కారువారి పాట'నే అని చెప్పొచ్చు. ఈ కథ బ్యాంక్ స్కామ్ చుట్టూ తిరుగుతుందనే ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ, సినిమాలో తమ హీరోకి ఏ బ్యాంకు స్కామ్ తో సంబంధం లేదని చెప్పడంతో, అసలు కథ ఏమై ఉంటుందా అనే ఆసక్తి అందరిలో పెరుగుతూ వెళుతోంది. ఇక 'పెన్నీ' సాంగ్ మేకింగ్ వీడియోలో కనిపించిన సితార .. సినిమాలో కూడా ఉంటుందా అనే సందేహాలు పెరుగుతున్నాయి.
తాజా ఇంటర్వ్యూలో సితార ప్రస్తావన రావడంతో మహేశ్ బాబు స్పందిస్తూ .. 'పెన్నీ' ప్రమోషన్ సాంగ్ లో సితార కనిపిస్తే బాగుంటుందనే ఐడియా తమన్ దే. నేను క్లైమాక్స్ షూటింగులో ఉండగా తమన్ అక్కడికి వచ్చి తన ఆలోచన చెప్పాడు. నేను ఆలోచించి చెప్పేలోగానే తమన్ .. నమ్రతకు చెప్పడం .. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఆ వెంటనే షూటింగ్ చేయడం కూడా జరిగిపోయింది. ఇదంతా ఒక మూడునాలుగు రోజుల్లో జరిగిపోయింది. ఇప్పుడు తను సినిమాలో నేను ఎందుకులేను అని అడుగుతోంది .. నేనేం చెప్పను?
సితార పేరు ఎండ్ టైటిల్స్ లో వేయరా అని మీరు అడుగుతున్నారు. ఇది చూసి సితార మళ్లీ నన్ను అడుగుతుంది. ఇక దయచేసి మీరు ఇలాంటివన్నీ అడగొద్దు. ఇప్పుడు ప్రింట్లు ఆల్రెడీ యూఎస్ వెళ్లిపోయాయి .. ఇప్పుడు చేసేది కూడా ఏమీ లేదు.
సితార చేసిన డాన్స్ చూసిన తరువాత నాకు చాలా గర్వంగా అనిపించింది. తను చేసిన క్లాసికల్ డాన్స్ వీడియో కూడా ఒకటి చూశాను. నాకు తెలిసి భవిష్యత్తులో తను చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. ఇక కీర్తికి సలహా ఇవ్వవలసి వస్తే ఏ సలహా ఇస్తారని అడుగుతున్నారు .. 'మహానటి'కి ఏం సలహా ఇస్తాం" అంటూ నవ్వేశారు.
బెస్ట్ కో ఆర్టిస్ట్ అని చాలామంది హీరోయిన్ల విషయంలో చెప్పాను .. అలా చెప్పాలి కదండీ. చేసేదే రెండేళ్లకి ఒక సినిమా అని మీరే అంటున్నారు. మరి అలాంటప్పుడు అలా చెప్పకపోతే ఎవరొచ్చి యాక్ట్ చేస్తారు చెప్పండి. ఇక అం తా కూడా నా గ్లామర్ రహస్యం ఏమిటని అడుగుతున్నారు.
అలా అడగడం చిరాగ్గా ఏమీ లేదు .. హ్యాపీగానే అనిపిస్తుంది. నేను అన్నీ తింటాను .. కాకపోతే కరెక్టుగా తింటాను. పెరుగన్నం .. బర్గర్లు .. బ్రెడ్లు లాంటివి అసలు ముట్టుకోను. లాక్ డౌన్ సమయంలో నేను స్విమ్మింగ్ నేర్చుకున్నాను. పెద్దయిన తరువాత స్విమ్మింగ్ నేర్చుకోవడం ఎంత కష్టమో నాకు అర్థమైంది" అంటూ చెప్పుకొచ్చారు.