Begin typing your search above and press return to search.

నా ఫ్యాన్స్ తిడతారేమోనని కీర్తి చాలా భయపడింది: మహేశ్

By:  Tupaki Desk   |   21 May 2022 10:30 AM GMT
నా ఫ్యాన్స్ తిడతారేమోనని కీర్తి చాలా భయపడింది: మహేశ్
X
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ రూపొందించిన 'సర్కారువారి పాట' సినిమా, ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైత్రీ - 14 రీల్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమాకి మహేశ్ బాబు కూడా ఒక భాగస్వామిగా ఉన్నాడు. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో విలన్ గా సముద్రఖని మెప్పించాడు.

పాటల పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమా, కథాకథనాల పరంగా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా టీమ్ వైజాగ్ లో సక్సెస్ మీట్ ను కూడా నిర్వహించింది. ఫస్ట్ వీక్ లో ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ అభిమానులతో మహేశ్ బాబు .. కీర్తి సురేశ్ ఇంటరాక్షన్ నుంచి ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఒక అభిమాని మహేశ్ బాబుపై ఒక కవిత రాశానని చెప్పి చదివి వినిపించాడు. అప్పటివరకూ మహేశ్ బాబును 'అన్నా అన్నా' అంటూ పిలుస్తూ వచ్చిన అభిమాని, కీర్తి సురేశ్ దగ్గరకి వచ్చేసరికి 'వదిన' అంటూ సంభోదించాడు. ఆ మాటకి మహేశ్ బాబు ఒక్కసారిగా నవ్వేస్తూ 'ఏంటయ్యా కీర్తిని వదిన అంటున్నావ్? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను .. అందరినీ వరసలు కలిపేసుకుంటున్నావ్? అన్నారు.

ఆ అభిమాని కాస్త తడబడిపోయి 'కీర్తి అక్క అంటాను .. ఓకేనా? అంటూ ఆమెను పొగిడేశాడు. అంతా విన్న మహేశ్ బాబు, 'అమ్మా నువ్వు ఇరగదీసేస్తున్నావ్ .. సాయంత్రం ఒకసారి పరశురామ్ గారిని కలూ" అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.

ఇక మరొక అభిమాని మాట్లాడుతూ .. ఒక సీన్లో 'కీర్తి సురేశ్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు మీరు చాలా ఎగ్జైట్ అవుతారు కదా? రియల్ లైఫ్ లో ఎప్పుడైనా అలా చేశారా? అని అడిగితే, "మా ఆవిడకి నాకు గొడవపెట్టాలని ఫిక్స్ అయ్యారా ఏంటి?" అంటూ మహేశ్ నవ్వారు. అవతల కీర్తి సురేశ్ లేకుండానే తాను ఆ సీన్ చేసినట్టు చెప్పారు.

ఈ సినిమాలో ఒక సీన్లో నన్ను కీర్తి తిట్టాలి .. నా ముఖం చూస్తూ తిట్టాలని పరశురామ్ చెప్పాడు. 'మీ ముఖం చూస్తూ తిట్టడం నా వల్ల కాదు సార్ అని కీర్తి నాతో అంది. మీ ఫ్యాన్స్ ఊరుకోరు నేను చేయను సార్ అంది. వాళ్లు ఏమీ అనరమ్మా .. నా నిజంగా ఆ సీన్ చేసేటప్పుడు తనకి చాలా భయం వేసిందని .. ఇప్పటికీ ఆ సీన్ గురించి మాట్లాడుతుంటే తనకి భయం వేస్తోందని చెప్పుకొచ్చింది.