Begin typing your search above and press return to search.

రెండు ద‌శాబ్ధాల సూప‌ర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   30 July 2018 4:55 AM GMT
రెండు ద‌శాబ్ధాల సూప‌ర్‌ స్టార్‌
X
ఇంతింతై వ‌టుడింతై.. 200కోట్ల క్ల‌బ్ హీరోగా ఎదిగాడు మ‌హేష్‌. ఇదో అసాధార‌ణ చ‌రిత్ర‌. మొద‌టి సినిమాకి ఇప్ప‌టికి మ‌హేష్‌లో ఎంత ప‌రిణ‌తి. ఎంత‌టి మార్పు!! తొలి సినిమాతో 24వ సినిమా వ‌సూళ్లు ఎంత‌? అని పోల్చి చూడ‌డం స‌రికాదు కానీ, అలా పోల్చి చూస్తే 20 రెట్లు స్టార్‌డ‌మ్ పెరిగింద‌ని మాత్రం అంచ‌నా వేయొచ్చు. నూనూగు మీసాల `రాజ‌కుమారుడు`గా కెరీర్ ప్రారంభించిన‌పుడు మ‌హేష్‌లో ప‌రిణ‌తి జీరో. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు అసమాన ప్ర‌తిభ‌ - ప్ర‌కాష్‌ రాజ్ అద్భుత న‌ట‌న‌ - రియ‌ల్ ప్రిన్స్‌ లా క‌నిపించే మ‌హేష్ క‌రిష్మా ఇవ‌న్నీ `రాజ‌కుమారుడు` చిత్రం విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి. ఆ సినిమాకి మ‌ణిశ‌ర్మ ఇచ్చిన సంగీతం ప్ల‌స్‌. సొట్ట‌బుగ్గ‌ల ప్రీతిజింతా గ్లామ‌ర్ అంతే పెద్ద అస్సెట్ అయ్యింది. రాజ‌కుమారుడు రిలీజై నేటితో 19ఏళ్లు అయ్యింది. 30జూలై 1999లో రిలీజైంది. అంటే మ‌హేష్ కెరీర్ వ‌య‌సు 19. వ‌చ్చే ఏడాది (2019) ఈ తేదీకి స‌రిగ్గా రెండు ద‌శాబ్ధాల కెరీర్ పూర్త‌వుతుంది. అప్ప‌టికి 25 సినిమాలు పూర్త‌వుతాయ‌న్న‌మాట‌.

ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలోని కెరీర్‌ ల్యాండ్ మార్క్‌ ని అందుకోబోతున్నాడు మ‌హేష్‌. ప్ర‌తి ఒక్క‌రి కెరీర్‌ లో ఒడిదుడుకులు ఉంటాయి. నేడు సూప‌ర్‌ స్టార్ అని పిలుచుకుంటున్న మ‌హేష్ కెరీర్ ఆరంభంలోనే ఎన్నో ఫ్లాప్‌ లు ఎదుర్కొన్నాడు. నాని - బాబి - యువ‌రాజు - సైనికుడు ఇవ‌న్నీ ఫ్లాప్‌ లు. ఆ క్ర‌మంలోనే ఏం చేయాలో పాలుపోని స‌న్నివేశంలో కృష్ణ‌వంశీ - మురారి - గుణ‌శేఖ‌ర్ `ఒక్క‌డు` - పూరి -పోకిరి లాంటి సినిమాల‌తో బిగ్ బ్రేక్ ఇచ్చారు. ఆ త‌ర్వాత ఎదురేలేనివాడిగా 25 సినిమాల సూప‌ర్‌ స్టార్‌ గా ఎదిగాడు. అదీ సంగ‌తి.