Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ తో ఉన్నా.. మనసంతా రాజమౌళి మీదే!

By:  Tupaki Desk   |   23 Sep 2022 8:25 AM GMT
త్రివిక్రమ్ తో ఉన్నా.. మనసంతా రాజమౌళి మీదే!
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఇప్పుడు లేనివిధంగా నెవర్ బిఫోర్ అనే కాంబినేషన్స్ తెరపైకి రాబోతున్నాయి. ముఖ్యంగా మహేష్ బాబు తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా అతిపెద్ద సినిమాలతో వండర్స్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు అని చెప్పవచ్చు. ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న త్రివిక్రమ్ తో ఒక సినిమా చేసి ఆ తర్వాత పాన్ ఇండియా రికార్డులు క్రియేట్ చేసిన రాజమౌళితో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నప్పటికీ కూడా తన మనసు మొత్తం కూడా ఎక్కువగా రాజమౌళి సినిమాపైనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక విధంగా త్రివిక్రమ్ పక్క లెక్కలతోనే సినిమా స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాడు అని చెప్పవచ్చు.

అంతేకాకుండా మహేష్ కూడా స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గతంలో అయితే త్రివిక్రమ్ కథ అనుకున్న తర్వాత ల్ షూట్ మధ్యలో మార్పులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

కానీ మహేష్ కోసం మాత్రం పర్ఫెక్ట్ గా ఫుల్ స్క్రిప్ట్ అయితే రెడీ చేశాడు కాబట్టి ఈ ప్రాజెక్టు ఉన్నది ఉన్నట్లుగా వస్తుంది అని పెద్దగా టెన్షన్ పెట్టుకోలేదట. కానీ రాజమౌళితో అంతకుమించి అనేలా ఉండాలి కాబట్టి మహేష్ బాబు వీకెండ్స్ లో మాత్రం రాజమౌళితో ప్రత్యేకంగా ఆన్లైన్ జూమ్ కాల్స్ లో మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. రాజమౌళి తన ప్రతి హీరోతో కూడా ముందస్తు ప్రణాళికతోనే స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటాడు.

అలాగే హీరో మెంటల్ గా ప్రిపేర్ కావాలి అని టెక్నికల్ గా కూడా చర్చలు జరుపుతూ ఉంటాడు. కాబట్టి చాలావరకు అలాంటి విషయాలు మహేష్ బాబుతో షేర్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.ఒక హాలీవుడ్ VFX స్టూడియో తో కూడా ఇప్పటికే చర్చలు జరిపిన రాజమౌళి స్క్రిప్ట్ డెవలప్ అవుతున్న కొద్ది కూడా ప్రతి వారం లేదా రెండు వారాలకు ఒకసారి ఆన్లైన్ లో మహేష్ తో మాట్లాడుకుంటున్నారట.

అలాగే నెలకొకసారి డైరెక్ట్ స్పెషల్ మీటింగ్స్ కూడా అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు మహేష్ త్రివిక్రమ్ సినిమాను పక్క ప్రణాళికతో పూర్తి చేస్తూ మరోవైపు రాజమౌళితో వ్యూహాలు రచిస్తున్నాడు. ఇక త్రివిక్రమ్ ప్రాజెక్టు షూటింగ్ అయితే ఏడాదిలోపు పూర్తవుతుంది. ఇక ఆ లోపు రాజమౌళి కూడా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి వచ్చే ఏడాది జనవరి అనంతరం రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.