Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాపై మహేష్ ఫోకస్
By: Tupaki Desk | 31 Oct 2017 4:42 AM GMTటాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అత్యంత అందగాడైన హీరోగా గుర్తింపు ఉంది. సినిమాకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించగల స్టార్ ఇమేజ్ ఉంది. అన్నీ అనుకూలంగా ఉన్నా ఈ మధ్య కమర్షియల్ హిట్ అన్నది అందకుండా పోతోంది. బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తర్వాత ఎంతో ఆలోచించి ఎ.ఆర్.మురుగదాస్ తో స్పైడర్ సినిమా చేశాడు. మురుగదాస్ ఈ సినిమా తెగ చెక్కుతూ లేట్ చేసినా ఎంతో ఓపిక పట్టాడు. చివరకు ఫలితం మాత్రం సంతోషపరచలేదు.
మహేష్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే దాని ప్రభావం కలెక్షన్లపై విపరీతంగా ఉంటోంది. ఇందుకు కారణం సోషల్ మీడియాలో వచ్చే నెగిటివ్ పబ్లిసిటియేనని మహేష్ అతడి సన్నిహితులు భావిస్తున్నారట. దీంతో ఇప్పుడు మహేష్ సోషల్ మీడియాలో బలం పెంచుకోవాలని డిసైడ్ అయ్యాడు. ఆయన భార్య నమ్రత ఈ బాధ్యత తీసుకుంది. మహేష్ తర్వాత మూవీగా కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న నా పేరు శివ రిలీజ్ నాటికి సోషల్ మీడియాలో మంచి పాజిటివ్ ఒపీనియన్ - బజ్ క్రియేటయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఫేస్ బుక్ - ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ లలో టీమ్ మహేష్ బాబు పేరుతో ఓ పేజీ కనిపిస్తోంది.
ఈ పేజీల్లో పోస్టయ్యే మెసేజీలు ఫాలో అవుతూ సోషల్ మీడియాలో నెట్ వర్క్ అకౌంట్లన్నింటినీ మేనేజ్ చేసే బాధ్యత నమ్రత ఓ ఎక్స్ పర్ట్ టీంకి అప్పగించిందట. ఆ టీం ఇప్పటికే తమ పని అండర్ కరెంట్ గా చేసుకుంటూ వెళ్లిపోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎప్పుడూ లేనిది భరత్ అనే నేను సంబంధించి సోషల్ మీడియాలో పాజిటివ్ న్యూస్ బాగా కనిపిస్తోంది. చూద్దాం.. ఈ ఆలోచన మహేష్ కు ఏమేరకు ప్లస్సవుతుందో..