Begin typing your search above and press return to search.
మహేశ్ ది కాన్ఫిడెన్సా? ఓవర్ కాన్ఫిడెన్సా?
By: Tupaki Desk | 19 April 2018 12:22 PM ISTఅనవసరంగా పెదవి విప్పని బ్యాచ్ ఒకటి ఉంటుంది. ప్రతి రంగంలోనూ ఇలాంటి వారు కొందరు ఉంటారు. ఎంతవరకూ తమ పని ఏదో తాము చేసుకెళుతుంటారు. తమకు సంబంధించి కూడా ఎక్కువ తక్కువలు మాట్లాడకుండా.. కొలత వేసినట్లుగా మాట్లాడేసి చక్కా పోతారు.
ఇలాంటి వారికి సినిమా ఇండస్ట్రీ కూడా మినహాయింపు కాదు. విపరీతమైన గ్లామర్ ఉన్న ఈ ఫీల్డ్ లో తమకు అవసరమైనప్పుడు మాత్రమే వార్తల్లోకి రావటం అన్నది అంత తేలికైన విషయం కాదు. అందులోకి బోలెడంత ఇమేజ్ ఉన్న వారికి అస్సలు సాధ్యం కాదంటారు. కానీ.. మహేశ్ అందుకు భిన్నం.
యూత్ మొదలుకొని అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గరై.. తమ ఇంట్లో వ్యక్తిగా పీలయ్యే మహేశ్ విషయంలో వార్తలు పెద్దగా రావు. వచ్చినా.. ఆయన చేసే ట్వీట్లు.. ఆయన సినిమాలకు సంబంధించి తప్పించి కాంట్రావర్సీల్లో అస్సలు కనిపించరు. ఇక.. తన సినిమా గురించి కూడా ఎక్కువ హైప్ చేసి మాట్లాడటం కనిపించదు.
అలాంటి మహేశ్ తాజాగా తాను నటించిన భరత్ అనే నేను.. మూవీ గురించి రోటీన్ కు భిన్నంగా మాట్లాడారని చెప్పాలి. తన సినిమా మీద ఆయన పెట్టుకున్న కాన్ఫిడెన్స్ చూస్తే అవాక్కు అవ్వాల్సిందే. ప్రతిసారీ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన కుటుంబంతో కలిసి టూర్ కి వెళుతుంటారు. ఫలితం సంగతి తర్వాత.. టూర్ మాత్రం పక్కా అన్నట్లు ఉంటుంది.
ఈసారి మాత్రం అందుకు భిన్నంగా సినిమా రిలీజ్ కు ముందే ఆయన ఫారిన్ టూర్ వెళ్లి వచ్చేశారు. ఎందుకిలా అని అడిగితే.. మహేశ్ నోటి నుంచి ఆసక్తికరమైన మాట వచ్చింది. సినిమా మీద కాన్ఫిడెన్స్ తో ముందే తాను టూర్ వెళ్లి వచ్చినట్లు చెప్పారు. తన కెరీర్ లోనే బెస్ట్ ప్రీ రిలీజ్ ఫేజ్ గా ఆయన చెప్పుకోవటం గమనార్హం.
తానింత ఆనందంగా ఎప్పుడూ లేనని.. సినిమా రిలీజ్ కాకముందే ఒక బ్లాక్ బస్టర్ వైబ్ లా ఉందని.. తన సినిమా సక్సెస్ కావటం పక్కా అన్న ధీమాను వ్యక్తం చేశారు మహేశ్. మరి.. ఆయనది కాన్ఫిడెన్సో.. ఓవర్ కాన్ఫిడెన్సో అన్న విషయం మరికొద్ది గంటల్లో తేలిపోతుందని చెప్పాలి.