Begin typing your search above and press return to search.

ఎడిటర్ కి మహేష్ స్పెషల్ విషెస్.. ఎందుకో తెలుసా?

By:  Tupaki Desk   |   12 May 2023 6:59 PM
ఎడిటర్ కి మహేష్ స్పెషల్ విషెస్.. ఎందుకో తెలుసా?
X
సినిమా అనగానే ఎవరికైనా ముందు హీరో, హీరోయిన్లు గుర్తుకు వస్తారు. ఆ తర్వాత దర్శకులు, మ్యూజిక్ దర్శకులను గుర్తిస్తారు. అంతే. కానీ ఓ సినిమా పూర్తవ్వాలంటే చాలా మంది కృషి ఉంటుంది. వారిలో ఎడిటర్ పాత్ర మరింత కీలకం. సినిమాని ఎక్కడ కట్ చేయాలో ఎడిటర్ బాగా తెలుస్తుంది. ఆయన సరిగా ఎడిట్ చేస్తేనే ఫలితం అందంగా ఉంటుంది.

చాలా సినిమాలకు ఎడిటింగ్ వర్క్ బాగుంది, బాలేదు లాంటి కామెంట్స్ వినే ఉంటారు. అది అంతా ఎడిటర్ చేతిలోనే ఉంటుంది. అలాంటి ఎడిటర్ లలో ఒక అద్భుతమైన ఎఢిటర్ శ్రీకర్ ప్రసాద్. ఆయన సినీ రంగంలో తన కెరీర్ ని ప్రారంభించి దాదాపు 40 సంవత్సరాలు అవుతోంది.

ఈయన సాధారణ ఎడిటర్ కాదు. ఎడిటింగ్ విభాగంలో దాదాపు తిమ్మిది నేషనల్ అవార్డులు సొంతం చేసుకున్నారు. కేవలం తెలుగు మాత్రమే కాదు, తెలుగు, మళయాళ, కన్నడ, హిందీ సినిమాలకు ఆయన ఎడిటర్ గా పని చేశారు. ఈయన 1988లో తొలిసారి రాఖ్ అనే హిందీ చిత్రం ద్వారా తొలిసారి బెస్ట్ ఎడిటర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు.

ఆయన తెలుగులో ప్రముఖ హీరోలందరి సినిమాలకు ఎడిటర్ గా చేశారు. ఇటీవల విడుదలై టాలీవుడ్ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఆర్ఆర్ఆర్ సినిమా కి కూడా ఈయనే ఎడిటర్ గా పని చేయడం విశేషం. ఆయన తాజాగా తన కెరీర్ ప్రారంభించి 40ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎఢిట్ చేసిన పలు సినిమాల క్లిప్స్ అన్నీ కలిపి ఓవీడియో తయారు చేశారు.

ఆ వీడియోని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ లో షేర్ చేశారు. గ్రేట్ మైల్ స్టోన్ అని చెబుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో, ఆయనకు మహేష్ ఫ్యాన్స్ సైతం అభినందనలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుం మహేష్ తివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత రాజమౌళితో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.