Begin typing your search above and press return to search.
క్యాట్ ఈజ్ ఔటాఫ్ బ్యాగ్.. ప్చ్!
By: Tupaki Desk | 8 Aug 2019 1:30 AM GMTఅల్లరి సితార అల్లరల్లరి గురించి ఎంత చెప్పినా తక్కువే. డాడ్ తో కలిస్తే సీతా పాప అల్లరి అసలే చెప్పనక్కర్లేదు. ఆ ఇద్దరూ కలిసి ఇంట్లో చాలానే అల్లరి చేస్తుంటారు. సూపర్ స్టార్ అనే సంగతినే మర్చిపోయి మహేష్ సితారతో కలిసి ఆటలు ఆడుకుంటారు.
అన్నిసార్లు డాడ్ తోనే కుదరదు కదా! అలాంటప్పుడు సితార ఆటలాడుకునేందుకు ఎవరెవరు ఉంటారు? అంటే ఇరుగు పొరుగు బంధుమిత్రుల పిల్లలు చాలా మంది తన స్నేహితులే. వాళ్లతో ఆటా పాటా కామన్ గా ఉండేవే. అయితే తనకు పెట్స్ తో కూడా ఆటలాడుకునే అలవాటు ఉంది.
ఇదిగో ఇక్కడ క్యూట్ క్యాట్ తో సితార ఇలా ఎంత లవ్ లీగా ఆడుకుంటోందో. అలా చంకనెత్తుకున్నా ఆ పిల్లి ఏమాత్రం గొడవ చేయకుండా బుద్ధిగా స్నేహంగా ఒదిగిపోయింది. బహుశా రాజధాని నగరంలోనే ఇంత బుద్ధిమంతురాలైన పిల్లి ఇంకోటి ఉండదేమో! తెల్లని ఊల్ తో తళతళా మెరుస్తోంది. అన్నట్టు ఆ పిల్లి బ్యాగు లోంచి బయటికి వచ్చింది.. దాని పేరు క్లియో! అంటూ హింటిచ్చారు నమ్రత. కొంపదీసి ఇది బొమ్మ పిల్లి కాదు కదా? మీడియాకే ఛమ్కీ తినిపిస్తున్న దొంగ పిల్లి అసలే కాదు కదా?