Begin typing your search above and press return to search.
డ్యాన్స్ తో అదరగొట్టిన సితార.. మహేష్ ఫిదా
By: Tupaki Desk | 30 Jan 2023 6:19 PM GMTమహేష్ కూతురు సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ.... నెటిజన్స్ కి దగ్గరగా ఉంటుంది. ఇక మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ల నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తోందనడంలో సందేహం లేదు. సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ... డాన్స్ వీడియోలు, ఫొటోస్ షేర్ చేస్తూ ఉంటుంది సితార.
తాజాగా ఆమె ఓ డాన్స్ వీడియోను పోస్ట్ చేసింది. ఆ పాట ఎవరిదో కాదు తన తండ్రి మహేష్ నటించిన సినిమానే. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అతడు మూవీలో పిల్లగాలి అల్లరి సాంగ్ కు సితార స్టెప్పులు వేసి అలరించింది. ఈ పాటను అతడు లో త్రిష చేసింది. అలాగే సితార కూడా తన కళ్లతోనే ఎన్నో హావభావాలు పలికిస్తూ... స్టెప్పులు వేసింది. ఈ వీడియోలో సితార మంచి స్మైల్‌తో వేసిన డ్యాన్స్ మూవ్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. నెటిజన్స్ అయితే సూపర్ డాన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఈ వీడియో ను నమ్రత, సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇక దీనికి నమ్రతా.... నీ కళ్ళలో ఉన్న చిలిపిదనమే నీ చిన్ని చిన్ని డ్యాన్స్ లను అందరి ముందుకు తీసుకు వచ్చేలా చేస్తోంది... అంటూ క్యాప్షన్ లో రాసుకొచ్చింది. ఇక సితార డాన్స్ చేసిన ఈ పాటకు యాని మాస్టర్ కొరియోగ్రఫీ చేసినట్లు తెలుస్తుంది.
సితార ఇంతకు ముందు కూడా ఇలాంటి డ్యాన్స్‌లు చేసి ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ మధ్య మహేష్ సూపర్ హిట్ మూవీ సర్కారు వారి పాట సినిమాలోని కళావతి పాట, క్లాసికల్ డ్యాన్స్ వీడియోలు కూడా షేర్ చేసింది. గత ఏడాది విడుదల అయిన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో 'పెన్నీ పెన్నీ' లిరికల్ వీడియో సాంగ్ లో కూడా సితార డాన్స్ చేసింది. సితార డాన్స్ యూట్యూబ్ రికార్డ్స్ వ్యూస్ వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో కూడా చాల మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.