Begin typing your search above and press return to search.

ఫామ్ లైఫ్‌ ఆస్వాదిస్తున్న సితార

By:  Tupaki Desk   |   29 Jan 2018 4:44 AM GMT
ఫామ్ లైఫ్‌ ఆస్వాదిస్తున్న సితార
X
రీసెంట్ గా రిలీజ్ అయిన భాగమతి మూవీలో అనుష్క చెలరేగిపోయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో 'ఎవడు పడితే వాడు రావడానికి.. ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమన్నా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా' అంటూ స్వీటీ ఓ పవర్ ఫుల్ డైలాగ్ పేల్చింది. భాగమతి అడ్డాకు కాకపోయినా.. పశువుల దొడ్డిలో ప్రత్యక్షం అయిపోయింది మహేష్ బాబు కూతురు సితార.

విశాలమైన పచ్చిక బయళ్లు కనిపిస్తున్న ప్రాంతంలో.. ఓ ఆవు వద్ద పాలు తాగుతున్న లేగదూడ ముందు నుంచుని.. చూడ ముచ్చటైన పోజ్ ఇచ్చింది సితార. అటు గ్రీనరీ అందాలను.. ఇటు పశువుల ఆప్యాయతను చూసి అనందించగా.. ఆ క్షణాలను కెమేరాలో బంధించేసింది అమ్మ నమ్రతా శిరోద్కర్. పిల్లలకు ప్రాథమిక అంశాలు కూడా తెలియాలంటున్న ఆమె.. అదే ఉద్దేశ్యంతో తన ఫామ్ హౌస్ కు తీసుకెళ్లానని చెబుతోంది. ఆ పశువులను కూడా తమ కుటుంబంలోనే భాగంగా చెప్పిన నమ్రత.. ఆ లేగదూడ కారణంగా తమ ఫ్యామిలీ మరింత పెరిగిందని చెప్పడం విశేషం.

జంతువులు అయినా తల్లీ పిల్లల ఆప్యాయతను అన్వేషిస్తున్నామని.. ఫామ్ లైఫ్ చాలా బాగుందని నమ్రతా చెప్పగా.. సూపర్ స్టార్ కూతురు సితార మొహంలో ఆ అద్భుత దృశ్యాన్ని చూసిన ఆనందం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇకపోతే ఇలా టాలీవుడ్ లో ఫామ్ లైఫ్‌ ఆస్వాదించే వారిలో రామ్ చరణ్‌ అండ్ ఉపాసన.. బన్నీ అండ్ ఫ్యామిలీ కూడా ఉన్నారు. వారికి ఆవులతో పాటు గుర్రాలు కూడా ఉన్నాయిలే.