Begin typing your search above and press return to search.
# కరోనా: సితార టిప్స్ సో నైస్ .. మీరూ వినండి
By: Tupaki Desk | 27 March 2020 2:36 PM GMTకరోనా వైరస్ కి అమెరికా ఇండియా అనే తేడా ఏం లేదు. అగ్ర రాజ్యాన్నే గడగడలాడిస్తుంటే ఇండియాలో హై అలెర్ట్ ప్రకటించారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా లాక్ డౌన్లు ప్రకటించడంతో ఎక్కడివారు అక్కడ గందరగోళంలో పడిపోయారు. ఇక కరోనా మహమ్మారీ విజృంభణ భయోత్సాతానికి దారి తీస్తోంది. ఈ నేపథ్యంలో తారలు విరాళాల్ని డొనేట్ చేయడమే గాక.. ఈ మహమ్మారీ భారిన పడకుండా అప్రమత్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు తారల వీడియోలు వైరల్ అయ్యాయి.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ డాటర్ సితార కొన్ని టిప్స్ ని సోషల్ మీడియా ద్వారా అందించింది. డాడీ కోటి విరాళాన్ని సీఎం నిధికి ప్రకటిస్తే.. ఇప్పుడు సీతా పాప ఇలా తనవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ జనం ముందుకు వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇంతకీ సితార ఏమని టిప్స్ అందించింది? అంటే.. ``కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో అందరూ ఇంట్లోనే ఉండండి. మేము కూడా సేఫ్‌గా ఇంట్లోనే ఉన్నాం. బయటకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా మాస్క్ వేసుకోండి. జ్వరం.. పొడి దగ్గు.. మోషన్స్.. జలుబు ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. ఇంట్లో ఉన్నా కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి. అలాగే శానిటైజర్ తో 22 సెకండ్లపాటు చేతులను కడుక్కోవాలి. ఏ వస్తువును ముట్టుకున్నా లేక ఇంట్లో ఏ వర్క్ చేసిన తర్వాత ఖచ్చితంగా మోచేతుల వరకూ శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. అలాగే మీరు దగ్గినా.. తుమ్మినా.. అరిచేతుల్లోకి కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోండి. దయచేసి చేతులతో మీ ముఖాన్ని.. కళ్లను.. పెదాలను ముట్టుకోకండి`` అని తెలిపింది. కరోనాతో యుద్ధం చేద్దాం రండి అంటూ ఎంతో లవ్ లీగా వీడియోని అభిమానులకు అందించింది.
సోషల్ మీడియాల్లో సితార ఫ్యాన్స్ ఈ వీడియోని వైరల్ చేస్తుంటే ఆ మేరకు ప్రజా ప్రయోజనం చేకూరుతోంది. సెలబ్రిటీల వారసులు ఇండ్లలోంచే సోషల్ మీడియాల ద్వారా ఈ తరహా ప్రచారం చేస్తే అది జనాలకు మరింతగా చేరువయ్యే అవకాశం ఉంది.
వీడియో కోసం క్లిక్ చేయండి