Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: 'మహరాష్ట్ర' సితార
By: Tupaki Desk | 23 Aug 2017 2:03 PM GMTమనకు తెలసిన విషయం ఏంటంటే.. మహేష్ బాబు పక్కా తెలుగు వ్యక్తి అయితే.. ఆయన సతీమణి.. మాజీ హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ మహారష్ట్ర నుండి వచ్చింది. ఆమె పక్కా మరాఠి గాళ్. అయితే ఇప్పుడు మహేష్ కూతురు కూడా ఓసారి అక్కడి గెటప్ లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అదిగో అందుకే ఆ ఫోటో చూడండి.
ఆల్రెడీ మహేష్-నమ్రతల కూతురు సితార డ్యాన్స్ నేర్చుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ఒక ప్రముఖ నృత్యకారిణి దగ్గర సాంప్రదాయ నృత్యంలో శిక్షణ పొందుతున్నారు.. సితార్ అండ్ ఆమె స్నేహితులు. ఇప్పుడు ఆ స్నేహితురాళ్ళలో ఒకరు బెంగాళి తరహా గెటప్ లో రెడీ అయితే.. సితార మాత్రం తన తల్లి ఇంటి గెటప్ అయిన మహారాష్ట్రకు చెందిన మరాఠి అమ్మాయిగా ముస్తాబైంది. ఏదన్నా ఫ్యాషన్ పెరేడ్ కోసం ఇలా చేశారా లేదంటే డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇలా రెడీ అయ్యారా తెలియదు కాని.. ఈ ఫోటోలను చూసి నమ్రత మాత్రం చాలా ఆనందపడుతోంది.
ఇకపోతే ఇప్పుడు సితార ఒకటే పేచీనట. ఆల్రెడీ రోజూ స్పైడర్ సినిమాలోని బూమ్ బూమ్ పాటను పాడేస్తున్న సితార.. ఆ సినిమా ఎప్పుడు చూపిస్తావ్ మమ్మీ.. ఎప్పుడు చూపిస్తావ్ డాడీ.. అంటూ నానా హంగామా చేస్తోందట. మరి సెప్టెంబర్ 27న మనతో కలిపి ఒకేసారి స్పైడర్ ను చూపిస్తారా లేదంటే సితారకు ముందే స్పెషల్ షో వేస్తారో చూడాలి!!