Begin typing your search above and press return to search.

మహేష్‌ మామిడిపళ్ళు అదిరాయ్‌ అంతే

By:  Tupaki Desk   |   12 Nov 2015 5:19 AM GMT
మహేష్‌ మామిడిపళ్ళు అదిరాయ్‌ అంతే
X
ప్రిన్స్ మ‌హేష్ ఫ్యామిలీ లైఫ్ ఆల్‌ టైమ్ హాట్ టాపిక్‌. అత‌డు ఓ వైపు కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబ జీవితాన్ని ప‌క‌డ్భంధీగా ప్లాన్ చేసుకుంటాడన్న పేరుంది. ఫ్యామిలీకి ఏ లోటూ రానివ్వ‌డు. ఖాళీ స‌మ‌యం చిక్కితే అత‌డికి ఫ్యామిలీ లైఫ్ త‌ప్ప ఏమాత్రం క్ల‌బ్బు - ప‌బ్బు లైఫ్ ఇష్ట‌ప‌డ‌డు. అందుకే హీరోల్లో అత‌డు ఆల్వేస్ యూనిక్‌. నిన్న‌టి రోజున దివ్వీ దివ్వీ దీపావ‌ళిని కుటుంబ స‌భ్యుల‌తో - పిల్ల‌ల‌తో గ్రాండ్‌ గా చేసుకున్నాడు. గౌత‌మ్‌ - సితార‌ల‌తో కాక‌ర‌పువ్వొత్తులు - భూచ‌క్రాలు కాల్పించాడు.

ఇకపోతే నిన్న‌టి దీపావ‌ళి సంద‌ర్భంగా స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌కు అరుదైన కానుక‌లు ఇచ్చాడు ప్రిన్స్‌ - స్వీట్లు - ఆర్గానిక్ మామిడి ప‌ళ్లు - స్నాక్స్‌ - డ్రై ఫ్రూట్స్.. ఇలా ర‌క‌ర‌కాల గిఫ్టు ప్యాకింగుల్ని అంద‌రికీ అందించాడు. అస‌లే శ్రీ‌మంతుడు చిత్రంతో ఇండ‌స్ర్టీ రికార్డ్ కొట్టాడు. ఆగ‌డు లాంటి ఫ్లాప్ త‌ర్వాత వ‌చ్చిన సూప‌ర్‌ హిట్ ఇది. అందుకే ఆ కిక్కులో ప్రిన్స్ ఇలా అంద‌రినీ ఖుషీ చేస్తూనే ఉన్నాడు. శ్రీ‌మంతుడు వంటి గొప్ప చిత్రాన్ని త‌న‌కి ఇచ్చినందుకు కొర‌టాల‌కు ఖ‌రీదైన ఆడి కార్‌ ని కానుక‌గా ఇచ్చాడు. ఇప్పుడు సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తి సారీ త‌న చుట్టూ ఉన్న‌వాళ్లంద‌రినీ తెగ ఖుషీ చేసేశాడు.

అయితే నిన్న‌టి గిఫ్టుల్లో ఓ గిఫ్ట్ వెరీ స్పెష‌ల్‌. మ‌హేష్‌ - న‌మ్ర‌త అండ్ గౌత‌మ్ కృష్ణ ఈ ముగ్గురూ క‌లిసి డైరెక్ట‌ర్ క్రిష్‌ ని ప్ర‌త్యేకించి విష్ చేశారు. క్రిష్‌ కి ఓ బొకేని కూడా పంపించాడు మ‌హేష్‌. దానిపై హ్యాండ్ రిట‌న్ లెట‌ర్స్ కూడా క‌నిపించాయి. ఇది నిజంగానే క్రిష్‌ కి వెరీ స్పెష‌ల్ గిఫ్ట్‌. అయితే ఈ ఇద్ద‌రూ క‌లిసి ప‌నిచేసే సినిమా ఎప్ప‌టికి సెట్స్‌ కెళుతుందో? అప్ప‌ట్లో శివ‌మ్ ఉంటుంద‌ని టాక్ వ‌చ్చినా ఎందుక‌నో టేకాఫ్ అవ్వ‌లేదు. ఇప్ప‌టికైనా ఈ కాంబినేష‌న్‌ లో సినిమా ఉంటుందా? ప‌్చ్ .. ఏమో?