Begin typing your search above and press return to search.

మహేష్.. ఆ నిర్ణయానికి కట్టుబడతాడా?

By:  Tupaki Desk   |   29 April 2018 5:30 PM GMT
మహేష్.. ఆ నిర్ణయానికి కట్టుబడతాడా?
X
కొన్ని ప్రయోగాలు చేసి ఎదురు దెబ్బలు తిన్నపుడు హీరోల్లో ఒక వైరాగ్యం వచ్చేస్తుంటుంది. ఇకపై ప్రయోగాల జోలికి వెళ్లను.. కమర్షియల్ సినిమాలే చేస్తాను అనే మాటలు మాట్లాడుతుంటారు. మాస్ రాజా రవితేజ పలు సందర్భాల్లో ఇదే మాట అన్నాడు. కానీ రొటీన్ మాస్ మసాలా సినిమాలతో కూడా అతను దారుణమైన ఫలితాలందుకున్న సందర్భాలు బోలెడున్నాయి. మాస్ రాజా సంగతలా వదిలేస్తే ఈ మధ్య ఆశ్చర్యకరంగా మహేష్ బాబు సైతం ఇలాగే మాట్లాడాడు. ప్రయోగాలు చేసి చేసి అలసిపోయానని.. ఇక అభిమానులకు నచ్చే కమర్షియల్ సినిమాలే చేస్తానని అన్నాడు. నిజానికి వైవిధ్యమైన సినిమాలు చేయడమే మహేష్ కు ప్రత్యేక గుర్తింపు తెచ్చి పెట్టింది. ‘భరత్ అనే నేను’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ ఈ ప్రత్యేకత గురించే ఎన్టీఆర్ కూడా మాట్లాడాడు.

అలాంటిది ఇంకొన్ని రోజుల్లోనే మహేష్ ఆ వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు మహేష్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే దిశగా సాగుతున్న ‘భరత్ అనే నేను’ కూడా రొటీన్ సినిమా ఏమీ కాదు. మహేష్ సీఎం పాత్ర చేయడం కొత్తే. ఒక ప్రయోగమే. ఈ కథ కూడా కమర్షియల్ ఫార్మాట్లో ఏమీ సాగదు. కొన్ని కమర్షియల్ హంగులుంటాయి కానీ.. కథానాసురమే సినిమా సాగుతుంది. రెగులర్ కమర్షియల్ స్టైల్ సినిమా అయితే కాదిది. మరి ఇలాంటి సినిమాతో అంత పెద్ద విజయాన్నందుకున్న మహేష్.. ఇక తాను ప్రయోగాలు చేయను.. కమర్షియల్ సినిమాలే చేస్తాను అనడమేంటి?అయినా అభిమానులకు నచ్చే సినిమాంటే కమర్షియల్ సినిమలా? ప్రయోగాలు చేస్తే వాళ్లు మెచ్చరా?అసలిప్పుడు ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్నే వాళ్లు ఇష్టపడట్లేదు. అభిమానులు అయినా అంతే. కొత్త తరహా సినిమాలకే అందరూ పట్టం కడుతున్నారు. అలాంటి సినిమాలు చేస్తేనే అభిమానులూ గర్విస్తున్నారు. కాబట్టి మహేష్ తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకుని డిఫరెంట్ రూటులోనే సాగాల్సిన అవసరముంది.