Begin typing your search above and press return to search.
ఈ రెండేళ్లలో చాలా జరిగాయ్ .. ఎమోషనలైన మహేశ్ బాబు!
By: Tupaki Desk | 8 May 2022 3:30 AM GMTమహేశ్ బాబు తన కథల్లో కొత్తదనం .. తన పాత్రల్లో వైవిధ్యం ఉండాలని కోరుకుంటారు. ఆయనకి కథ వినిపించాలంటే పర్ఫెక్ట్ గా తయారు చేసుకుని వెళ్లవలసిందే. కొంతమంది హీరోలు తమకి కథ అక్కడక్కడా నచ్చలేదని చెప్పేసి, అంతవరకూ మార్చుకుని రమ్మని చెబుతూ ఉంటారు. కానీ మహేశ్ అలా కాదు .. తనకి నచ్చకపోతే నచ్చలేదని చెబుతారు. నచ్చితే చేసేద్దామని అంటారు. అంతేగానీ తన దగ్గరికి వచ్చిన కథకు రిపేర్లు చేయడం ఆయనకి ఇష్టం ఉండదు.
అలాంటి మహేశ్ తన తాజాగా చిత్రంగా రూపొందిన సినిమాగా 'సర్కారువారి పాట' కనిపిస్తుంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేశ్ బాబు మాట్లాడుతూ .. "రామ్ - లక్ష్మణ్ నా ఫేవరేట్ ఫైట్ మాస్టర్స్. ఇప్పటికీ వాళ్లిద్దరిలో రామ్ ఎవరో .. లక్ష్మణ్ ఎవరో నాకు తెలియదు. హీరోను ఎంత బాగా చూసుకుంటారో .. ఫైటర్స్ ను కూడా అంతే బాగా చూసుకుంటారు. అదే వాళ్లలో నాకు నచ్చే లక్షణం. అందువల్లనే అనుకుంటాను అంత పెద్ద మాస్టర్లు అయ్యారు.
అలాగే శేఖర్ మాస్టర్ కి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మైండ్ బ్లాక్ ఎంత ఇంపాక్ట్ ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. దానిని మించి ఈ సినిమాలో మాస్ సాంగ్ ఉంటుంది. ఈ సినిమా కోసం 10 రోజుల్లోనే ఒక సెట్ కావలసి వచ్చింది. ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ చకచకా ఆ పనిని చేసి పెట్టారు. ఆ సెట్లోకి అడుగుపెట్టగానే నేనే ఆశ్చర్యపోయాను. ఇంత తక్కువ సమయంలో ఇలా ఎలా వేశారా అని. మధీ 'శ్రీమంతుడు' సినిమాను ఎంతబాగా తీశాడో మీ అందరికీ తెలుసు .. అంతకంటే బాగా తీశాడు ఈ సినిమాను.
ఈ రెండేళ్లలో చాలా జరిగాయి .. చాలా మారాయి. నాకు బాగా దగ్గర వాళ్లు దూరమయ్యారు. ఏది జరిగినా .. ఏది మారినా మీ అభిమానం మాత్రం మారలేదు. మీరంతా ఇచ్చే ఈ ప్రోత్సాహం చాలు .. ధైర్యంగా ముందుకు వెళ్లిపోవడానికి అంటూ ఎమోషనల్ అయ్యా డు. 12వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రాబోతోంది. మళ్లీ మనందరికీ పండగే. మీ ఆశీస్సులు .. అభిమానం ఎప్పటి కీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.. థ్యాంక్యూ'' అంటూ ముగించారు.