Begin typing your search above and press return to search.

మహేష్ ఎంత హ్యాపీగా ఉన్నాడో

By:  Tupaki Desk   |   3 Jan 2018 10:55 AM GMT
మహేష్ ఎంత హ్యాపీగా ఉన్నాడో
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంత స్టార్ డమ్ ని అందుకున్నా బయట ప్రపంచంలో మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడని అందరికి తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీతో మహేష్ ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను ఒక స్టార్ కన్నా ముందు తండ్రిని అనే ఆలోచనతో రియల్ ఫ్యామిలీ హీరో అనే బిరుదును తెచ్చుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో బెస్ట్ ఫ్యామిలీ పర్సన్ లలో మహేష్ పేరు ముందుంటుంది.

ఇక షూటింగ్ తరువాత ఏ మాత్రం గ్యాప్ దొరికినా మహేష్ తన చిన్న ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లి మంచి వాతావరణంలో ఎంజాయ్ చేసి వస్తుంటాడు. ఒక చిన్న పిల్లాడిలా ఎంజాయ్ చేస్తుంటాడు. రీసెంట్ గా అదే తరహాలో కొంచెం గ్యాప్ దొరకడంతో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లాడు. న్యూ ఇయర్ ని హ్యాపీ గా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే అందుకు సంబందించిన ఒక ఫొటో మహేష్ ఎంత ఎంజాయ్ చేశాడో చెప్పేసింది.

సూపర్ స్టార్ రేంజ్ వచ్చినా కూడా మహేష్ సింపుల్ గా ఒక యువకుడిలా ఎంజాయ్ చేస్తున్నట్లు స్టిల్ ఇచ్చాడు. మహేష్ ఎంత హ్యాపీగా ఉన్నాడో ఆ ఫొటోను చూస్తే అర్ధమవుతోంది. నిజంగా మహేష్ ని ఈ విధంగా ఎప్పుడు చూడలేదని చెప్పాలి. సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మహేష్ తన ఫ్యామిలీతో మాత్రం చాలా సంతోషంగా ఉంటాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.